
బీసీలకు..
స్థానిక సంస్థల రిజర్వేషన్లు ఖరారు గెజిట్ జారీ చేసిన జిల్లా ఎన్నికల అధికారి జిల్లా వ్యాప్తంగా 21 జెడ్పీటీసీ, ఎంపీపీ స్థానాలు వీటిలో తొమ్మిది బీసీలకు, నాలుగు ఎస్సీలకు మూడు ఎస్టీలకు, ఐదు జనరల్‌కు కేటాయింపు జనరల్‌లో ఐదు స్థానాలు కేటాయింపు
పూల పరిమళం.. రికార్డు సంబురం
రాష్ట్ర సాంస్కృతిక, పర్యాటకశాఖ ఆధ్వర్యంలో సరూర్‌నగర్ స్టేడియంలో సోమవారం ‘మహా బతుకమ్మ’ వేడుకలు నిర్వహించారు. 1,500 మందితో తెలంగాణ బతుకమ్మ ఫోక్ డ్యాన్స్ అబ్బుర పరిచింది. 63 అడుగుల ఎత్తయిన భారీ బతుకమ్మ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ రెండు ప్రదర్శనలు అతిపెద్ద జానపద నృత్యంగా, అతిపెద్ద బతుకమ్మగా రెండు గిన్నిస్ వరల్డ్ రికార్డులు సాధించాయి. మరోవైపు జిల్లాలో సద్దుల బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. ఎటు చూసినా సందడి కనిపించింది. – హుడాకాంప్లెక్స్
మహిళలకు
సాక్షి, రంగారెడ్డిజిల్లా: స్థానిక సంస్థలకు రిజర్వేషన్లు ఖరారయ్యాయి. ఈ మేరకు సోమవారం జిల్లా ఎన్నికల కమిషన్ గెజిట్ విడుదల చేసింది. ఇప్పటికే జెడ్పీ పీఠాన్ని ఖరారు చేసిన ఎన్నికల కమిషన్ తాజాగా జెడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీ సహా గ్రామ పంచాయతీ సర్పంచ్, వార్డు సభ్యులకు సంబంధించిన రిజర్వేషన్లు ఖరారు చేసి జాబితాను వెల్లడించింది. జిల్లాలో 21 జెడ్పీటీసీ, ఎంపీపీ స్థానాలు ఉండగా, వీటిలో తొమ్మిది బీసీలకు, నాలుగు ఎస్సీలకు, మూడు ఎస్టీలకు, ఐదు జనరల్ కేటగిరీ కోసం కేటాయించారు. మొత్తం జెడ్పీటీసీ, ఎంపీపీ సీట్లలో తొమ్మిది మహిళలకు కేటాయించారు. 230 ఎంపీటీసీ స్థానాలు ఉండగా, వీటిలో 94 స్థానాలను మహిళలకు కేటాయించారు. 2011 జనాభా లెక్కల ప్రకారం 25 స్థానాలు ఎస్టీలకు, 49 స్థానాలు ఎస్సీలకు కేటాయించారు. డెడికేషన్ కమిటీ నివేదిక ప్రకారం 97 స్థానాలు బీసీలకు కేటాయించారు. మిగిలిన 59 స్థానాలను జనరల్ కేటగిరీ కోసం కేటాయించారు. ఇదిలా ఉంటే జిల్లాలో 526 పంచాయతీలకు సైతం రిజర్వేషన్లు ఖరారు చేశారు.
జిల్లా ప్రాదేశిక స్థానాలకు రిజర్వేషన్లు ఇలా
ఎస్టీ: మంచాల, కొత్తూరు, ఫరూఖ్‌నగర్ (మహిళ).
ఎస్సీ: శంకర్‌పల్లి, చేవెళ్ల, కందుకూరు (మహిళ), షాబాద్ (మహిళ).
బీసీ: మొయినాబాద్ (మహిళ), కొందుర్గు, ఇబ్రహీంపట్నం (మహిళ), కేశంపేట యాచారం, మహేశ్వరం (మహిళ), తలకొండపల్లి, మాడ్గుల, కడ్తాల్ (మహిళ).
జనరల్: అబ్దుల్లాపూర్‌మెట్ (మహిళ), జిల్లేడుచౌదరిగూడెం, నందిగామ (మహిళ) శంషాబాద్, ఆమనగల్లు.
మండల పరిషత్‌ల రిజర్వేషన్లు ఇలా..
ఎస్టీ: కొత్తూరు (మహిళ), ఫరూఖ్‌నగర్, తలకొండపల్లి.
ఎస్సీ: శంకర్‌పల్లి (మహిళ), చేవెళ్ల, షాబాద్, శంషాబాద్ (మహిళ).
బీసీ: జిల్లేడు చౌదరిగూడెం, మొయినాబాద్, కొందుర్గు, ఇబ్రహీంపట్నం (మహిళ), కేశంపేట (మహిళ), కందుకూరు (మహిళ), యాచారం, మహేశ్వరం (మహిళ), మంచాల
జనరల్: అబ్దుల్లాపూర్‌మెట్ (మహిళ), నందిగామ, మాడ్గుల, కడ్తాల్(మహిళ), ఆమనగల్లు.
ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు
ఎన్నికల ప్రవర్తన నియమావళిని అనుసరిస్తూ ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేపట్టాలని కలెక్టర్ నారాయణరెడ్డి అధికారులకు సూచించారు. సోమవారం కలెక్టరేట్ నుంచి ఆర్డీఓలు, ఎంపీడీఓలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు సూచనలు చేశారు. ఎన్నికల విధుల్లో ఎలాంటి పొరపాట్లు జరగకుండా ప్రతి ఒక్కరూ తమకు కేటాయించిన విధులను నిర్వర్తించాలని ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్) శ్రీనివాస్, జిల్లా రెవెన్యూ అధికారి సంగీత, నోడల్ అధికారులు, ఆర్డీఓలు, ఎంపీడీఓలు, ఎంపీఓలు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
జెడ్పీటీసీ/ఎంపీపీ స్థానాల కేటాయింపు ఇలా..
కేటగిరీ మొత్తం మహిళలు పురుషులు/
మహిళలు
ఎస్టీ 3 1 2
ఎస్సీ 4 2 2
బీసీ 9 4 5
జనరల్ 5 2 3
మొత్తం 21 9 12