పంజాబ్‌ మాజీ డిప్యూటీ సీఎంకు ఘన స్వాగతం | - | Sakshi
Sakshi News home page

పంజాబ్‌ మాజీ డిప్యూటీ సీఎంకు ఘన స్వాగతం

Sep 30 2025 8:58 AM | Updated on Sep 30 2025 8:58 AM

పంజాబ

పంజాబ్‌ మాజీ డిప్యూటీ సీఎంకు ఘన స్వాగతం

నందిగామ: పంజాబ్‌ మాజీ ఉప ముఖ్యమంత్రి, రాజస్థాన్‌ ఏఐసీసీ ఇన్‌చార్జి సుఖ్జిందర్‌ సింగ్‌ రంధావాకు మండల ముఖద్వారమైన బైపాస్‌ రహదారి వినాయక్‌ స్టీల్‌ పరిశ్రమ సమీపంలో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌, కాంగ్రెస్‌ నాయకులు సోమవారం ఘన స్వాగతం పలికారు. చాకలిదాని గుట్ట తండాకు చేరుకొని గిరిజన మహిళలతో కలిసి బతుకమ్మ ఆడి నృత్యం చేశారు. అనంతరం కాంగ్రెస్‌ పార్టీ జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ శివశంకర్‌ గౌడ్‌, పార్టీ మండల అధ్యక్షుడు జంగ నర్సింహ యాదవ్‌, మాజీ సర్పంచ్‌ రాజు నాయక్‌, పలువురు కాంగ్రెస్‌ నాయకులు పాల్గొన్నారు.

అస్తిత్వ పోరాటానికి

సిద్ధం అవుదాం

షాద్‌నగర్‌: అస్థిత్వ పోరాటానికి మాలలు సిద్ధం కావాలని మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు మహేశ్‌ మాల పిలుపునిచ్చారు. పట్టణంలోని ఆర్‌ఆండ్‌బీ అతిథి గృహంలో సోమవారం ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రాజ్యాంగానికి వ్యతిరేకంగా చేపట్టే ఎస్సీ ఉప వర్గీకరణను ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని, రోస్టర్‌ పాయింట్లను వెంటనే సవరించాలని డిమాండ్‌ చేశారు. డిమాండ్ల సాధన కోసం నవంబర్‌ 2న హైదరాబాద్‌లో భారీ ఎత్తున మాలల రణభేరి మహాసభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సభకు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని కోరారు. అనంతరం రణభేరికి సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. కార్యక్రమంలో నాయకులు సుంకం నర్సింహ, శ్రీను, కబీర్‌, మల్లేష్‌, గాలయ్య, వినోద్‌, నరేష్‌, శ్రీను, కుమార్‌, చిట్టి, అంజి, మల్లేష్‌ తదితరులు పాల్గొన్నారు.

సదర్‌ ఉత్సవ కమిటీ రాష్ట్ర కార్యదర్శిగా రవియాదవ్‌

షాద్‌నగర్‌: సదర్‌ ఉత్స వ కమిటీ రాష్ట్ర కార్యదర్శిగా షాద్‌నగర్‌ పట్ట ణానికి చెందిన చీపిరి రవి యాదవ్‌ ఎన్నికయ్యారు. హైదరాబాద్‌ లోని సైదాబాద్‌లో సోమవారం సదర్‌ ఉత్సవ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన కమిటీని ఎన్నుకున్నారు. అఖిల భారత యాదవ మహాసభ జాతీయ కార్యదర్శి లక్ష్మణ్‌, రాష్ట్ర అధ్యక్షుడు చింతల రవీందర్‌, సదర్‌ ఉత్సవ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు మహేందర్‌ యాదవ్‌ చేతుల మీదుగా చీపిరి రవియాదవ్‌ నియామక పత్రం అందుకున్నారు.

కాంగ్రెస్‌కు కాలం చెల్లింది

బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు,

మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి

ఇబ్రహీంపట్నం: కాంగ్రెస్‌ పార్టీకి కాలం చెల్లిందని, రాష్ట్రంలో రెండేళ్ల పాలన పూర్తికాకముందే ఆ పార్టీ నిజస్వరూపాన్ని ప్రజలు గుర్తించారని బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు,మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు. నియోజకవర్గ బీఆర్‌ఎస్‌ సమన్వయ కమిటీ సమావేశం సోమవారం శేరిగూడలోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అబద్ధాల మాటలతో, మోసపు వాగ్దానాలతో గద్దెనెక్కిన కాంగ్రెస్‌కు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో తగిన రీతిలో బుద్ధి చెప్పేందుకు ప్రజలుసిద్ధంగా ఉన్నారన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపించుకునే బాధ్యత ప్రతి కార్యకర్తపై ఉందన్నారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర నాయకులు క్యామ మల్లేష్‌, మంచిరెడ్డి ప్రశాంత్‌కుమార్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్‌ సత్తు వెంకటరమణారెడ్డి, మాజీ ఎంపీపీ కృపేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

పంజాబ్‌ మాజీ డిప్యూటీ సీఎంకు ఘన స్వాగతం
1
1/3

పంజాబ్‌ మాజీ డిప్యూటీ సీఎంకు ఘన స్వాగతం

పంజాబ్‌ మాజీ డిప్యూటీ సీఎంకు ఘన స్వాగతం
2
2/3

పంజాబ్‌ మాజీ డిప్యూటీ సీఎంకు ఘన స్వాగతం

పంజాబ్‌ మాజీ డిప్యూటీ సీఎంకు ఘన స్వాగతం
3
3/3

పంజాబ్‌ మాజీ డిప్యూటీ సీఎంకు ఘన స్వాగతం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement