
శాకాహారంతో ఆరోగ్యానికి మేలు
ఎమ్మెల్యే కాలె యాదయ్య
చేవెళ్ల: ఆరోగ్యవంతమైన సమాజం కోసం ప్రతిఒక్కరూ శాకహారం అలవాటు చేసుకోవాలని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. మున్సిపాలిటీ కేంద్రంలోని కేజీఆర్ గార్డెన్‌లో ఆదివారం బ్రహ్మర్షి పితామహా పత్రీజీ పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ మూమ్‌మెంట్ జిల్లా అధ్యక్షుడు నడిమొళ్ల శంకర్ ఆధ్వర్యంలో మహాకరుణ అహింసా శాకాహార ర్యాలీ, ధ్యాన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ర్యాలీని ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పిరమిడ్ సొసైటీ ఆధ్వర్యంలో ప్రజలకు ఆరోగ్యం సమాజం, ప్రకృతి కోసం చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. శాకాహారం అనేది ఆరోగ్యానికి, ఆధ్యాత్మికతకు మంచిదన్నారు. ధాన్యంతో ఎన్నో లాభాలు ఉన్నాయన్నారు. ప్రతిఒక్కరూ ధ్యానం అలవాటు చేసుకుంటే మానసిక ప్రశాంతత ఆరోగ్యం లభిస్తాయని చెప్పారు. కార్యక్రమంలో రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సభ్యుడు సత్యనారాయణరెడ్డి, మాజీ సర్పంచులు శైలజ, భీమయ్య, ప్రభాకర్, నాయకులు వసంతం, వెంకట్‌రెడ్డి, పెంటయ్యగౌడ్, ఆగిరెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, వెంకటరంగారెడ్డి, రాములు, శ్రీశైలం, ప్రభాకర్, రాజు, నర్సింలు, వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.