
రైలులో ప్రయాణికుడి మృతి
సికింద్రాబాద్‌ః రైలులో ప్రయాణిస్తున్న యువకుడు మృతి చెందిన సంఘటన సికింద్రాబాద్ జీఆర్పీ పరిధిలో జరిగింది. రైల్వే కానిస్టేబుల్ పండరి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. జార్ఖండ్‌కు చెందిన ఆలమ్ అన్సారి(27) అనే యువకుడు హౌరా నుంచి సికింద్రాబాద్‌కు ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ రైలులో ప్రయాణిస్తున్నాడు. ఆదివారం ఉదయం అతను కోచ్ నంబర్ 5లోని సీట్ నెం. 32లో మృతి చెంది ఉన్నాడు. విధుల్లో ఉన్న రైల్వే టీటీఐ ద్వారా సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని గాంధీ మార్చురీకి తరలించారు.