
కారు–బైక్ ఢీ.. యువకుడి దుర్మరణం
ఆమనగల్లు: పట్టణంలో హైదరాబాద్–శ్రీశైలం జాతీయ రహదారిపై ఆదివారం సాయంత్రం కారు–బైక్ ఢీకొన్న ప్రమాదంలో ఓ యువకుడి మృతి చెందారు. వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని పోలెపల్లి గ్రామ పరిధిలోని పాపర్లబోడుతండాకు చెందిన కేతావత్ వినోద్‌నాయక్(28) వ్యక్తిగత పని నిమిత్తం బైక్‌పై ఆమనగల్లు వచ్చాడు. హైదరాబాద్–శ్రీశైలం జాతీయ రహదారిపై వస్తుండగా అచ్చంపేట వైపునకు వెళుతున్న కారు వేగంగా ఢీకొట్టింది. దీంతో వినోద్‌నాయక్ అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. విషయం తెలియడంతో కుటుంబ సభ్యులు, తండావాసులు పెద్ద సంఖ్యలో సంఘటనా స్థలానికి చేరుకుని ఆందోళన చేశారు. దాదాపు అరగంటపాటు ట్రాఫిక్ నిలిచిపోయింది. ఆమనగల్లు ఎస్‌ఐ వెంకటేశ్ నచ్చజెప్పడంతో ఆందోళన విరమించారు. అనంతరం మృతదేహాన్ని కల్వకుర్తి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. దీనిపై కేసునమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
పోచారం: ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని సైబర్ నేరగాళ్లు మోసం చేసిన సంఘటన పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.. పెద్దపల్లి జిల్లా, హనుమాన్‌నగర్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగిణి వల్లపురెడ్డి సుశ్రుత పోచారంలోని సింగపూర్ టౌన్‌షిప్‌లో నివాసం ఉంటోంది. ఈ నెల 24న ఆమె సోదరి వాట్సాప్ నుంచి రూ. 4600 కావాలని మెసేజ్ రావడంతో డబ్బు పంపింది. మళ్లీ రూ. 20 వేలు కావాలని మెసేజ్ రావడంతో రూ. 10 వేలు పంపిన తర్వాత సోదరికి ఫోన్ చేయగా తన వాట్సాప్ హ్యాక్ అయిందని చెప్పింది. దీంతో సైబర్ నేరగాళ్లు తనను మోసం చేసినట్లు గుర్తించిన బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
గ్యాస్ సిలిండర్ పేలి గృహోపకరణాలు దగ్ధం
ఆల్విన్‌కాలనీ: గ్యాస్ సిలిండర్ పేలి గృహోపకరణాలు దగ్ధమైన సంఘటన ఎల్లమ్మబండ, అంబేడ్కర్ నగర్‌లో చోటు చేసుకుంది. అంబేడ్కర్ నగర్‌కు చెందిన బోయరాజు అనే వ్యక్తి కొన్నేళ్లుగా కమర్షియల్ సిలిండర్లను తెచ్చి చిన్న సిలిండర్లలో నింపి విక్రయిస్తున్నాడు. ఆదివారం ఉదయం శివ అనే వ్యక్తి అతడి వద్ద సిలిండర్ తీసుకెళ్లాడు. ఇంట్లో వంట చేసుకునేందుకు స్టవ్ వెలిగించడంతో ఒక్కసారిగా సిలిండర్ పేలి మంటలు చెలరేగడంతో గృహోపకరణాలు దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న జగద్గిరిగుట్ట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
విద్యుదాఘాతంతో గుర్తుతెలియని వ్యక్తి మృతి
విజయనగర్‌కాలనీ: మేకలకు ఆకులు తెంపడానికి వెళ్లి ఓ వ్యక్తి పక్కనే ఉన్న విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌కు తగలడంతో విద్యుదాఘాతానికి గురై మృతి చెందిన సంఘటన ఆదివారం ఆసీఫ్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ దయానంద్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఓ గుర్తుతెలియని వ్యక్తి ఆదివారం ఆసిఫ్‌నగర్ సయ్యద్‌అలీగూడలోని ఓ అపార్ట్‌మెంట్ వద్ద ఉన్న రావిచెట్టు ఆకులు తెంపడానికి ప్రహరీ పైకి ఎక్కాడు. ఆకులు తెంపే క్రమంలో ప్రమాద వశాత్తు పక్కనే ఉన్న ట్రాన్స్‌ఫార్మర్ తీగలు తగలడంతో విద్యుదాఘాతానికి గురై కింద పడ్డాడు. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న ఆసిఫ్‌నగర్ పోలీసులు 108కు సమాచారం అందించారు. అతడిని పరీక్షించిన అంబులెన్స్ సిబ్బంది అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. మృతుని సంబంధికులు ఆసిఫ్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో సంప్రదించాలని సూచించారు.

కారు–బైక్ ఢీ.. యువకుడి దుర్మరణం

కారు–బైక్ ఢీ.. యువకుడి దుర్మరణం

కారు–బైక్ ఢీ.. యువకుడి దుర్మరణం