శ్రమించి.. కొలువు సాధించి | - | Sakshi
Sakshi News home page

శ్రమించి.. కొలువు సాధించి

Sep 29 2025 10:26 AM | Updated on Sep 29 2025 10:26 AM

శ్రమి

శ్రమించి.. కొలువు సాధించి

మాడ్గుల: మండలంలోని నాగిళ్ల గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు గ్రూప్‌–2 ఫలితాల్లో మెరిశారు. ఒకే కుటుంబానికి చెందిన కంచనపల్లి ఆనంద్‌గౌడ్‌, కంచపల్లి సురేష్‌గౌడ్‌ ఉన్నత ఉద్యోగాలు సాధించడంతో కుటుంబసభ్యులతో పాటు గ్రామస్తులు అభినందించారు. ఆనంద్‌గౌడ్‌కు డిప్యూటీ తహసీల్దార్‌, సురేష్‌గౌడ్‌కు అసిస్టెంట్‌ కమర్షియల్‌ టాక్స్‌ ఆఫీసర్‌గా కేటాయించారు.

బండలేమూర్‌ వాసి ప్రతిభ

ఇబ్రహీంపట్నం: మున్సిపాలిటీలో జూనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న దేవరాం గ్రూప్‌–2 ఫలితాల్లో అసిస్టెంట్‌ కమర్షియల్‌ టాక్స్‌ ఆఫీసర్‌ ఉద్యోగాన్ని సాధించారు. మంచాల మండలం బండలేమూర్‌ గ్రామానికి చెందిన దేవరాం వికారాబాద్‌ జిల్లా కుల్కచర్లలోని గురుకుల విద్యాలయంలో పదో తరగతి వరకు, ఇబ్రహీంపట్నంలోని కార్తికేయ కళాశాలలో ఇంటర్‌, నగరంలోని నిజాం కళాశాలలో డిగ్రీ పూర్తి చేశారు. గతేడాది వెలువడిన గ్రూప్‌–4 ఫలితాల్లో జూనియర్‌ అసిస్టెంట్‌గా ఉద్యోగం సాధించి ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో పనిచేస్తున్నాడు. తాజాగా గ్రూప్‌–2లో ఫలితాల్లో ఏసీటీఓ ఉద్యోగాన్ని సాధించడం ఎంతో ఆనందాన్ని కలిగిస్తుందని దేవరాం అన్నారు

దృఢ సంకల్పంతో చదివి

ఇబ్రహీంపట్నం రూరల్‌: మండలంలోని పోల్కంపల్లి గ్రామానికి చెందిన గుండ్ల రాకేష్‌గౌడ్‌ గ్రూప్‌–2 ఫలితాల్లో అసిస్టెంట్‌ కమర్షియల్‌ టాక్స్‌ ఆఫీసర్‌గా ఉద్యోగం సాధించారు. చిన్నప్పటి నుంచి ఆయన చదువుల్లో చురుకు. తల్లిదండ్రులు కూలీ పనులు చేసి చదివించారు. దృఢ సంకల్పంతో ఉన్నత చదువులు చదవి గ్రూప్స్‌ పరీక్షలకు ప్రిపేర్‌ అయ్యాడు. ప్రస్తుతం హెచ్‌ఎండీఏలో జూనియర్‌ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్నారు. తాజాగా వెలువడించిన ఫలితాల్లో ఏసీటీగా ఉద్యోగం సాధించారు. దీంతో కుటుంబసభ్యులు, గ్రామస్తులు అభినందనలు తెలిపారు.

కొత్తపల్లివాసికి 27వ ర్యాంక్‌

శంకర్‌పల్లి: గ్రూప్‌–2 ఫలితాల్లో 27వ ర్యాంక్‌ సాధించి మండలవాసి సత్తా చాటాడు. కొత్తపల్లి గ్రామానికి చెందిన చంద్రకాంత్‌కి చార్మినార్‌ జోన్‌లో డిప్యూటీ తహసీల్దార్‌గా నియామకం అయినట్లు తెలిపారు. ఇప్పటికే ఆయన రామచంద్రపురంలోని ప్రభుత్వ కళాశాలలో జూనియర్‌ లెక్చరర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఈయన గతంలోనూ చేవెళ్ల ఆర్డీఓ కార్యాలయంలో జూనియర్‌ అసిస్టెంట్‌గా.. అంతకు ముందు పోస్టల్‌ శాఖలో జాబ్‌ సైతం చేశారు. తాజాగా డిప్యూటీ తహసీల్దార్‌గా నియామకం అవ్వడంపై ఆనందం వ్యక్తం చేశారు.

జిల్లాకు చెందిన పలువురు అభ్యర్థులు ఆదివారం టీజీపీఎస్సీ వెల్లడించిన గ్రూప్‌–2 ఫలితాల్లో సత్తా చాటారు. వివిధ శాఖల్లో ఉద్యోగాలు సాధించి యువతకు ఆదర్శంగా నిలిచారు.

గ్రూప్‌–2 ఫలితాల్లో సత్తా చాటిన

జిల్లా అభ్యర్థులు

శ్రమించి.. కొలువు సాధించి 1
1/4

శ్రమించి.. కొలువు సాధించి

శ్రమించి.. కొలువు సాధించి 2
2/4

శ్రమించి.. కొలువు సాధించి

శ్రమించి.. కొలువు సాధించి 3
3/4

శ్రమించి.. కొలువు సాధించి

శ్రమించి.. కొలువు సాధించి 4
4/4

శ్రమించి.. కొలువు సాధించి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement