
పిటిషన్ వెనక్కి తీసుకోవాలి
షాద్‌నగర్: ప్రభుత్వం బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తూ జీఓ జారీ చేస్తే రెడ్డి జాగృతి సంస్థ సభ్యులు కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం సరికాదని షాద్‌నగర్‌కు చెందిన బీసీ జేఏసీ నాయకులు టీజీ శ్రీనివాస్, రవీంద్రనాథ్, అర్జున్, నర్సింలు తదితరులు డిమాండ్ చేశారు. పిటిషన్‌ను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆదివారం పట్టణ చౌరస్తాలో ప్లకార్టులు పట్టుకొని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్ కల్పిస్తూ ప్రభుత్వం జీఓ జారీ చేస్తే దానిని వ్యతిరేకిస్తూ రెడ్డి జాగృతి సంస్థ కోర్టుకు వెళ్లడం సరికాదన్నారు. ప్రభుత్వం విద్య, ఉద్యోగాల్లో ఈడబ్ల్యూసీ కోటాలో పదిశాతం పెంచినప్పుడు బీసీలు ఎప్పుడు వ్యతిరేకించలేదని గుర్తు చేశారు. కానీ బీసీలకు ప్రభుత్వం 42శాతం రిజర్వేషన్లు కల్పిస్తే రెడ్డి జాగృతి కోర్టుకు వెళ్లడంతో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. రెండు వర్గాల మధ్య అలజడి సృష్టించే విధంగా రెడ్డి జాగృతి సంస్థ వ్యవహరించడం సరికాదన్నారు. కార్యక్రమంలో నాయకులు నర్సింలుగౌడ్, కరుణాకర్, చంద్రశేఖర్, వెంకటేష్, శంకర్, శ్రీను, నర్సింలు, నరేష్, రామలింగం, శేఖర్‌గౌడ్, కృష్ణ, బిజిలి సత్యం తదితరులు పాల్గొన్నారు.
బీసీ జేఏసీ నేతల డిమాండ్