నేడు మంత్రి శ్రీధర్‌బాబు రాక | - | Sakshi
Sakshi News home page

నేడు మంత్రి శ్రీధర్‌బాబు రాక

Sep 29 2025 10:25 AM | Updated on Sep 29 2025 5:57 PM

మొయినాబాద్‌: మున్సిపల్‌ పరిధిలోని అజీజ్‌నగర్‌లో నిర్మించిన డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల ప్రారంభోత్సవానికి సోమవారం ఐటీ, శాసనసభ వ్యవహారాల శాఖ, జిల్లా ఇన్‌చార్జి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు రానున్నట్లు మండల తహసీల్దార్‌ గౌతమ్‌కుమార్‌ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సోమవారం ఉదయం 8 గంటలకు ప్రారంభోత్సవ కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. మంత్రితోపాటు స్థానిక ఎమ్మెల్యే కాలె యాదయ్య హాజరవుతారని చెప్పారు.

ఎర్త్‌ సెంటర్‌ను సందర్శించిన స్వీడన్‌ దేశస్తులు

కడ్తాల్‌: మండల పరిధిలోని అన్మాస్‌పల్లి సమీపంలోని ఎర్త్‌సెంటర్‌ను ఆదివారం స్వీడన్‌ దేశస్తులు జాన్‌బుచ్‌ అండర్సన్‌, డాక్టర్‌ ఒయింకన్‌ పీటర్‌, లయన్స్‌ క్లబ్‌ ఆఫ్‌ హైదరాబాద్‌ ఈస్ట్‌ సెంటర్‌ సభ్యులు సందర్శించారు. ఈ సందర్భంగా ఎర్త్‌ సెంటర్‌లో నిర్వహిస్తున్న కార్యక్రమాల గురించి నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. పర్యావరణ పరిరక్షణకు సీజీఆర్‌ సంస్థ చేస్తున్న సేవలు బాగున్నాయని ప్రశంసించారు. అనంతరం స్థానిక వీరాంజనేయస్వామి ఆలయ పరిసరాల్లో మొక్కలు నాటారు. కార్యక్రమంలో సీజీఆర్‌ చైర్‌ పర్సన్‌ లీలా లక్ష్మారెడ్డి, సీజీఆర్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు లక్ష్మారెడ్డి, లయన్స్‌ క్లబ్‌ ఆఫ్‌ హైదరాబాద్‌ ఈస్ట్‌ సెంటర్‌ అధ్యక్షుడు సీతారావు, కార్యదర్శి నరసింహన్‌, వీరనారి చాకలి ఐలమ్మ కళాశాల ప్రొఫెసర్‌ డాక్టర్‌ ప్రియాకుమారి తదితరులు పాల్గొన్నారు.

ఏదుళ్ల బాల్‌రాజ్‌కు కీర్తిరత్న

ఇబ్రహీంపట్నం రూరల్‌: సాహిత్య రంగంలో తెలుగు భాషకు వన్నె తెస్తూ విశేషమైన కృషి కనబర్చినందుకు గాను మండలంలోని నాగన్‌పల్లి గ్రామానికి చెందిన ఏదుళ్ల బాల్‌రాజ్‌ను జాతీయస్థాయి కీర్తిరత్న పురస్కారం వరించింది. ఈ మేరకు ఆదివారం నగరంలోని రవీంద్రభారతిలో నిర్వహించిన కార్యక్రమంలో భవానీ సాహిత్య వేదిక ప్రధాన కార్యదర్శి వియల్‌ భవాని, అధ్యక్షుడు వైరాగ్యం ప్రభాకర్‌ చేతుల మీదుగా పురస్కారం అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పురస్కారం రావడం సంతోషంగా ఉందన్నారు. తెలుగు భాషను కాపాడడం కోసం మరింతగా కృషి చేస్తానని తెలిపారు. బాల్‌రాజ్‌ ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు.

మూసీలో తగ్గిన వరద ఉద్ధృతి

మణికొండ: ఉస్మాన్‌సాగర్‌ (గండిపేట), హిమాయత్‌ సాగర్‌లకు వరద ఉద్ధృతి తగ్గిపోవటంతో గేట్లను తగ్గించారు. దీంతో మూసీ నదిలో నీటి ప్రవాహం తగ్గుముఖం పట్టింది. ఆదివారం ఉదయం నుంచి జంట జలాశ యాల గేట్లను మూస్తూ వచ్చారు. మధ్యాహ్నం తర్వాత గండిపేట నుంచి 4 గేట్లను రెండు అడుగుల మేర ఎత్తి 920 క్యూసెక్కుల నీటిని మాత్రమే వదిలారు. పూర్తి స్థాయి నీటి మట్టం 1,790 అడుగులకు 1,789.15 అడుగులుగా నీటి మట్టం ఉండగా ఎగువ నుంచి 1,300 క్యూసెక్కుల వరద వస్తోందని అధికారులు తెలిపారు. ిహిమాయత్‌సాగర్‌ నీటి మట్టం 1763.50కి గాను ప్రస్తుతం 1,762.35 అడుగుల నీరు ఉందని, పైనుంచి 2,600 క్యూసె క్కుల వరద వస్తోందన్నారు. రెండు గేట్లను 3 అడుగుల మేర ఎత్తి 1981 క్యూసెక్కుల నీటిని మూసీ నదికి వదులుతున్నామన్నారు.

తెరుచుకున్న రోడ్లు

శనివారం రాత్రి వరకు మూసీ నదిలో పెద్ద ఎత్తున నీరు రావటంతో నార్సింగిలోని ఔటర్‌ సర్వీసు రోడ్లతో పాటు నార్సింగి నుంచి మంచిరేవుల గ్రామానికి వెళ్లే రోడ్లను మూసి వేసిన విషయం తెలిసిందే. ఆదివారం ఉదయం నుంచే గండిపేట గేట్లను తగ్గించటంతో మూసీలో వరద తగ్గిపోయింది. తిరిగి వర్షం కురిసి, వరద వస్తుందనే ఉద్దేశంతో సాయంత్రం వరకు రోడ్లను అలాగే మూసి ఉంచారు. సాయంత్రానికి వర్షం వచ్చే అవకాశం, పరీవాహకం నుంచి చెరువులోకి వరద తగ్గిపోవటంతో నార్సింగి మున్సిపాలిటీ పరిధిలో మూసిన అన్ని రోడ్లనూ తెరిచి రాకపోకలను పునరుద్ధరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement