
కొత్త మార్కింగ్‌తో రైతులకు నష్టం
షాద్‌నగర్‌రూరల్: ట్రిపుల్ ఆర్ రోడ్డు నిర్మాణంలో కొత్త మార్కింగ్‌తో ఎక్కువ మంది పేద రైతులు భూములు కోల్పోతున్నారని సీపీఎం జిల్లా నాయకుడు రాజు అన్నారు. శనివారం సీపీఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ట్రిపుల్‌ఆర్ బాధిత రైతులకు మద్దతుగా కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఫరూఖ్‌నగర్ మండల పరిధిలోని భీమారం, అయ్యవారిపల్లి, ఉప్పరిగడ్డతాండ, కేశంపేట మండల పరిధిలోని నిడదవెళ్లి, తొమ్మిదిరేకుల, కొందుర్గు మండల పరిధిలోని తంగెళ్లపల్లి, చెరుకుపల్లి, తుమ్మలపల్లి గ్రామాలకు చెందిన రైతులు తరలివెళ్లి ధర్నాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజు మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ట్రిపుల్‌ఆర్ నిర్మాణానికి అలైన్‌మెంట్‌ను ఇస్తున్నట్లు రూట్ మ్యాప్‌తో పాటుగా సర్వే నంబర్లను ప్రకటించడంతో రైతులు ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. ఎకరం, రెండు ఎకరాల భూమి ఉన్న పేద రైతులే అధికంగా ఉన్నారని, వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్న రైతులు భూములను కోల్పోతుండటంతో వారి జీవనోపాఽధి అగమ్యగోచరంగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు పెట్టుబడిదారుల ప్రయోజనాలకోసం పేదల భూములను లాక్కొని వారి పొట్టకొట్టొద్దని ఆగ్రహం వెల్లిబుచ్చారు. పాత అలైన్‌మెంట్ ప్రకారమే రీజినల్ రింగ్ రోడ్డు నిర్మించాలని లేదంటే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలను చేపడతా మని హెచ్చరించారు. కలెక్టరేట్‌కు తరలిన వారిలో సీపీఎం నాయకులు జగన్, రాజు, కుర్మయ్య, వెంకటయ్య, రైతులు లక్ష్మయ్య, నగేష్, శ్రీనివాస్, చంద్రకాంత్, రమేష్, రాంసింగ్, రాజు, రాంజీనాయక్, రవినాయక్, అమృనాయక్, మంగ్యనాయక్, పాండునాయక్, బద్రినాయక్ తదితరులు ఉన్నారు.
సీపీఎం జిల్లా నాయకుడు రాజు