
బలవంతపు భూ సేకరణ వద్దు
అనంతగిరి: రైతుల అనుమతి లేకుండా బలవంతంగా భూములు సేకరిస్తే పోరాటం తప్పదని సీపీఎం జిల్లా కార్యదర్శి మహిపాల్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ట్రిపుల్ ఆర్ అలైన్‌మెంట్ మార్చడం ద్వారా రైతులకు అన్యాయం జరుగుతోందన్నారు. పేదల పొలాల్లో రీజినల్ రింగ్ రోడ్డు, రేడియల్ రింగ్ రోడ్డు వేయడమేంటని ప్రశ్నించారు. రైతుల అభిప్రాయం తీసుకోకుండా భూములు తీసుకోవద్దని సూచించారు. పాత అలైన్‌మెంట్ ప్రకారమే రోడ్డు వేయాల ని డిమాండ్ చేశారు. అనంతరం అడిషనల్ కలెక్టర్ లింగ్యానాయక్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో నాయకులు రామకృష్ణ, సత్యనారాయణ, రమేష్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.