
ప్రయాణికుడి వద్ద విదేశీ బల్లులు, తాబేళ్ల పట్టివేత
శంషాబాద్: శంషాబాద్ విమానాశ్రయంలో భద్రతాధికారుల తనిఖీల్లో ఓ ప్రయాణికుడి వద్ద విదేశీ బల్లులు, తాబేళ్లు స్వాధీనం చేసుకున్నారు. వివరాలివీ... శనివారం సాయంత్రం ఇండిగో విమానం 6ఈ–1068లో విమానంలో బ్యాంకాక్ నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న లోకేష్ జయచంద్రన్ అనే ప్రయాణికుల లగేజీని అధికారులు తనిఖీ చేశారు. అందులో 8 కీలేడ్ బల్లులు, ఒక గిర్‌డిల్ బల్లి, ఒక రెండు తలలు కలిగిన తాబేలు బయటపడ్డాయి. దీంతో ప్రయానికుడిపై వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద కేసు నమోదు చేశారు. తీసుకొచ్చిన జీవులకు మరో విమానంలో బ్యాంకాక్‌కు తిరిగి పంపారు.