
చైతన్యయాదవ్ అంత్యక్రియలు పూర్తి
బడంగ్‌పేట్: కార్పోరేషన్ పరిధి నాదర్‌గుల్‌కు చెందిన తర్రె ఐలయ్య యాదవ్, మంగమ్మ దంపతుల కుమారుడు చైతన్యయాదవ్ అలియాస్ అభి (22) ఈ నెల 1వ తేదీన బ్రిటన్‌లో రోడ్డు ప్రమాదానికి దుర్మరణం చెందిన విషయం విదితమే. ఈ మేరకు శుక్రవారం రాత్రి మృతదేహం ఇంటికి రావడంతో శనివారం అశ్రునయనాల మధ్య నాదర్‌గుల్ శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించారు.
చెరువులను కాపాడుకోవాలి
ఇంగ్లండ్ హై కమిషనర్
మణికొండ: మన పరిసరాల్లో ఉన్న చెరువులను కాపాడుకోవటంతో పాటు వాటిని పరిశుభ్రంగా ఉంచుకుని వాటి వద్ద సేద తీరాలని ఇంగ్లండ్ (యూకే) హై కమిషనర్ గరేత్ అన్నారు. నార్సింగి మున్సిపాలిటీ, కోకాపేట కొత్త చెరువు వద్ద దృవాన్ష్ ఎన్‌జీఓ వారు నిర్వహించిన స్వచ్ఛతా హి సేవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... చెరువులను సుందరంగా తయారు చేసుకుని వాటి వద్ద ప్రజలు మంచి వాతావరణాన్ని ఆస్వాదించాలన్నారు. ఈ సందర్భంగా ఆయన చెరువు పరిసరాల్లో పడిన చెత్తను తొలగించారు. దృవాన్ష్ ఎన్‌జీఓ చేస్తున్న క్లీనింగ్ పనులను ఆయన అభినందించారు. కార్యక్రమంలో దృవాన్ష్ ఎన్‌జీఓ సిబ్బంది, వలంటీర్లు పాల్గొన్నారు.

చైతన్యయాదవ్ అంత్యక్రియలు పూర్తి