
అనంతుడి సేవలో హైకోర్టు జడ్జి
అనంతగిరి: వికారాబాద్ సమీపంలోని అనంతగిరి గుట్టపై వెలసిన శ్రీ అనంత పద్మనాభస్వామిని శనివారం తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి, వికారాబాద్ జిల్లా పోర్ట్‌పోలియో జస్టిస్ నామవరపు రాజేశ్వర్‌రావు దర్శించుకున్నారు. ఆలయ పూజారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ చరిత్ర, దేవుని మహత్యం గురించి ప్రధాన అర్చకులు వివరించారు. తీర్థ ప్రసాదాలు అందజేసి ఆశీర్వచనాలు ఇచ్చి జ్ఞాపికను అందజేశారు. అనంతరం ఆయన వికారాబాద్ కోర్టు భవన సముదాయాన్ని సందర్శించారు. జిల్లా బార్ అసోసియేషన్ సభ్యులు పలు సమస్యలపై వినతిపత్రం అందజేశారు. జిల్లా కోర్టు ఆవరణలో మరో అడిషనల్ సీనియర్ సివిల్ జడ్జి కోర్టు, సెకండ్ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టులు మంజూరు చేయాలని కోరారు. మంజూరైన జిల్లా కోర్టు నూతన భవనాన్ని త్వరగా ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం కలెక్టర్ ప్రతీక్‌జైన్, ఎస్పీ నారాయణరెడ్డి హైకోర్టు జడ్జిని మర్యాదపూర్వకంగా కలిశారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి డాక్టర్. సున్నం శ్రీనివాస్‌రెడ్డి, జిల్లా అదనపు న్యాయమూర్తి చంద్రకిశోర్, సీనియర్ సివిల్ జడ్జి వెంకటేశ్వర్లు, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి శాంతిలత, పరిగి జూనియర్ సివిల్ జడ్జి ఎన్ శిల్ప, కొడంగల్ జూనియర్ సివిల్ జడ్జి శ్రీరామ్, తాండూరు జూనియర్ సివిల్ జడ్జి శివలీల, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బస్వరాజ్ పటేల్ పాల్గొన్నారు.