
పని చేస్తున్న చోటే చోరీ
షాద్‌నగర్‌రూరల్: తాము పని చేస్తున్న గోదాంలోనే చోరీకి పాల్పడి లాకర్‌లో ఉన్న డబ్బులను దొంగిలించిన నిందితులను షాద్‌నగర్ పోలీసులు అరెస్టు చేసి శుక్రవారం రిమాండ్‌కు తరలించారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలు పట్టణ సీఐ విజయ్‌కుమార్ వెల్లడించారు. నందిగామ మండలం అప్పారెడ్డిగూడ గ్రామానికి చెందిన వత్తి శ్రీకాంత్, ఫరూఖ్‌నగర్‌కు చెందిన మొదంపల్లి మఽధు, షాద్‌నగర్‌లో నివాసం ఉంటున్న గుజరాత్ రాష్ట్రానికి చెందిన మౌలిక్ దిలీప్ బాయ్ దేవ్‌లు షాద్‌నగర్ శివారులోని జడ్చర్ల రోడ్డులో ఉన్న ఎన్‌టీఎక్స్ గ్రాసరీ గోదాంలో కొంత కాలంగా పని చేస్తున్నారు. గోదాంలోని సరుకులను వివిధ ప్రాంతాలకు వారు డెలివరీ చేయడంతో పాటుగా డబ్బులుకలెక్షన్ చేస్తున్నారు. అక్కడే మేనేజర్‌గా పని చేస్తున్న ప్రవీణ్ ఈనెల 17న కలెక్షన్ ద్వారా వచ్చిన రూ.4.21లక్షలు లాకర్‌లో ఉంచి ఇంటికి వెళ్లాడు. అదే రోజు రాత్రి గోదాంలో పని చేస్తున్న శ్రీకాంత్, మధు, మౌలిక్ దిలీప్ బాయ్ షెట్టర్ తాళాలను పగలగొట్టి లాకర్‌ను దొంగిలించారు. ఈ మేరకు గోదాం మేనేజర్ ప్రవీణ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సాంకేతిక నైపుణ్యంతో నగదు చోరీకి పాల్పడిన ముగ్గురు నిందితులను షాద్‌నగర్, శంషాబాద్ సీసీఎస్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. నిందితుల నుంచి కారు, మూడు సెల్‌ఫోన్లు, రూ.12వేల నగదు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.
నిందితులను అరెస్టు చేసిన పోలీసులు