
అప్రమత్తం చేసిన రెవెన్యూ యంత్రాంగం
రోజంతా ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తూనే ఉండటంతో అత్యవసర పనులున్న వారు మినహా ఇతరులెవరూ ఇంటి గడపదాట లేదు. వర్షానికి చలిగాలులు తోడవడంతో చిన్నారులు, వృద్ధులు రోజంతా దుప్పట్లోనే ముసుగేసి కన్పించారు. చెరువులు, కుంటలు పొంగి ప్రవహిస్తుండటంతో లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను జిల్లా రెవెన్యూ యంత్రాంగం అప్రమత్తం చేసింది. శంకర్‌పల్లి మండలం టంగుటూరు వద్ద మూసీ వాగు పొంగి ప్రవహిస్తుండటంతో స్థానికులను అలెర్ట్ చేసింది. హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్ దిగువ ప్రాంతాల్లోని ప్రజలను అప్రమత్తం చేసింది. శిథిల భవనాల నుంచి తక్షణమే ఖాళీ చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది.