
శనివారం శ్రీ 27 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2025
న్యూస్‌రీల్
షాబాద్: పారుతున్న పహిల్వాన్ చెరువు అలుగు
రోజంతా వాన
సాక్షి, రంగారెడ్డిజిల్లా: జిల్లాలో వర్షం దంచి కొట్టింది. వాగులు, వంకలు పొంగి ప్రవహించాయి. చెరువులు, కుంటలు మత్తడి దూకాయి. జిల్లేడు చౌదరిగూడ మండలం గుర్రంపల్లి గ్రామానికి చెందిన 60 ఏళ్ల వ్యక్తి వాగు దాటుతూ వరదలో కొట్టుకుపోయి చనిపోయాడు. గురువారం రాత్రి నుంచి శుక్రవారం రాత్రి వరకు ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. భారీ వర్షంతో జనజీవనం పూర్తిగా స్తంభించి పోయింది. ఓఆర్‌ఆర్ సహా విజయవాడ జాతీయ రహదారితో పాటు చేవెళ్ల, శ్రీశైలం, షాద్‌నగర్ జాతీయ రహదారులపైకి భారీగా వరద నీరు వచ్చి చేరడంతో ఆయా ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
షాబాద్‌లో అత్యధిక వర్షపాతం
తెలంగాణలోనే అత్యధికంగా షాబాద్ మండలం తాళ్లపల్లిలో 10.50 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, మండల కేంద్రంలో 10.23 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. చందనవెల్లిలో 8.63 సెం.మీ, మొగిలిగిద్దలో 7.95 సెం.మీ, కొందుర్గులో 7.60 సెం.మీ, చౌదరిగూడ మండలం కాసులాబాద్‌లో 6.78 సెం.మీ వర్షపాతం నమోదైంది. ఈసీ, మూసీ వాగులకు వరద పోటెత్తడంతో జంట జలాశయాల గేట్లు బార్లా తెరిచారు.
జంట జలాశయాల నుంచి నీటి విడుదల
స్తంభించిన జనజీవనం
రాకపోకలకు అంతరాయం
నీట మునిగిన పంటలు

శనివారం శ్రీ 27 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2025

శనివారం శ్రీ 27 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2025