
జర్నలిస్టుల సమస్యలు పరిష్కరిస్తాం
కందుకూరు: జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం సానుకూల ధృక్పథంతో ముందుకెళ్తోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. మండల కేంద్రంలోని శుభం కన్వెన్షన్‌లో శుక్రవారం జిల్లా టీడబ్ల్యూజేఎఫ్ మూడో మహాసభలు నిర్వహించారు. సభకు ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. జర్నలిస్టులు సమాజానికి అద్దం పట్టే వృత్తిదారులని, వారి సమస్యల పరిష్కారానికి ప్రత్యేకంగా దృష్టి సారిస్తామన్నారు. ఇళ్ల స్థలాల కేటాయింపు, విద్యార్థులకు ఫీజు రాయితీ, ఆరోగ్య భద్రత వంటి అంశాలను దశలవారీగా పరిష్కరిస్తామన్నారు. సుప్రీంకోర్టు తీర్పుతో ఇళ్ల స్థలాల విషయంలో సందిగ్ధత ఏర్పడిందని, న్యాయ నిపుణులు సూచించిన మార్గంలో న్యాయం చేసేలా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, ఎమ్మెల్సీ నవీన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కేఎల్లార్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మధుసూదన్‌రెడ్డి, బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు పి.కార్తీక్‌రెడ్డి, ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యుడు చిలకమర్రి నర్సింహ, సీపీఎం జిల్లా కార్యదర్శి పగడాల యాదయ్య, పీసీసీ ప్రధానకార్యదర్శి ఏ.జంగారెడ్డి, పీసీసీ సభ్యుడు దేప భాస్కర్‌రెడ్డి, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు బి.జంగారెడ్డి, టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు సోమయ్య, బస్వపున్నయ్య, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సత్యనారాయణ, సైదులు, సంఘం నాయకులు పాల్గొన్నారు.
మంత్రి శ్రీధర్‌బాబు