
పెండింగ్ వేతనాలు చెల్లించాలి
ఇబ్రహీంపట్నం రూరల్: పంచాయతీ కార్మికులకు పెండింగ్ వేతనాలు చెల్లించాలని తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు గ్యార పాండు డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. అనంతరం డీపీఓ సురేష్ మోహన్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా 3,116 మంది పారిశుద్ధ్య కార్మికులు పని చేస్తున్నారని తెలిపారు. నాలుగు నెలలుగా వేతనాలు చెల్లించకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. పండగ పూట పంచాయతీ కార్మికులను పస్తులుంచడం తగదని పేర్కొన్నారు. న్యాయమైన డిమాండ్లను వెంటనే నెరవేర్చాలన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా నాయకులు పోచమోని కృష్ణ, ఎస్.చందునాయక్, శ్రీను, జోగు మాధవి, జాపాల జంగయ్య, దేవదాస్, కవిత, కృష్ణ, పాండు, భాస్కర్, కవిత, శంకరయ్య, యాదయ్య తదితరులు పాల్గొన్నారు.
జీపీ ఎంప్లాయీస్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పాండు