
ఎల్మినేడు హెచ్‌ఎంకు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు
ఇబ్రహీంపట్నం రూరల్: ఎల్మినేడు ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కలమండల శ్రీనివాస్‌ను జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు వరించింది. విద్యార్థుల్లో ఆసక్తి పెంచుతూ వినూత్న రీతిలో బోధన చేస్తున్నందుకు శారదా ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో నగరంలోని బిర్లా ఆడిటోరియంలో గురువారం జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుడి అవార్డు అందజేశారు. ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్ ఇటికాల పురుషోత్తం, ఎమ్మెల్సీ మల్క కొమరయ్య, సినీనటులు రఘు కరుమంచి, పసునూరి శ్రీనివాస్ చేతుల మీదుగా ఆయన అవార్డు అందుకున్నారు. ఎల్మినేడు గ్రామ సభ్యులు చక్రపాణి, విజయేందర్ శుభాకాంక్షలు తెలిపారు.