
ప్రజా సంక్షేమమే లక్ష్యం
ఆమనగల్లు: అభివృద్ధి, సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని నాగర్‌కర్నూల్ ఎంపీ మల్లురవి, కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. కాంగ్రెస్ పాలనలో పల్లెలు, పట్టణాల్లో అభివృద్ధి వేగవంతంగా జరుగుతోందని తెలిపారు. మున్సిపల్ పరిధిలో రూ.10 కోట్లతో నిర్మించే సీసీ రోడ్లు, భూగర్భ మురుగుకాలువలు, సురసముద్రం చెరువు సుందరీకరణ పనులకు గురువారం రాత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పనిచేసే ప్రభుత్వానికి ప్రజలంతా అండగా ఉండాలన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘనవిజయం ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శంకర్, పీసీసీ సభ్యుడు అయిల శ్రీనివాస్‌గౌడ్, పీసీసీ కార్యదర్శి మధుసూదన్‌రెడ్డి, మార్కెట్‌చైర్మన్ యాట గీత, వైస్ చైర్మన్ భాస్కర్‌రెడ్డి, మాజీ వైస్ చైర్మన్ గుర్రం కేశవులు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు యాట నర్సింహ, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్, పట్టణ అధ్యక్షుడు మాణయ్య, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.