
దీన్ దయాల్ సేవలు మరువలేనివి
చేవెళ్ల: సమాజ సేవ, భారతీయ భావాలను ప్రపంచానికి చాటిన వ్యక్తి దీన్‌దయాల్ ఉపాధ్యాయ అని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అన్నారు. దీన్‌దయాల్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా మండలకేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో గురువారం ఆయ న చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించా రు. పుష్కరణి సమీపంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంకోసం పనిచేసిన నాయకుల్లో ఆయన ఎప్పటికీ గుర్తుండిపోతారన్నారు. కార్యక్రమంలో పార్టీ మున్సిపల్ అధ్యక్షుడు ఎ.అనంత్‌రెడ్డి, యువ నాయకుడు డాక్టర్ మల్గారి వైభవ్‌రెడ్డి, నాయకులు కుంచం శ్రీనివాస్, వెంకట్‌రాంరెడ్డి, కృష్ణ, మధుసూదన్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, బాలయ్య, ప్రవీణ్‌రెడ్డి పాల్గొన్నారు.
చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి