
అన్నదాతల గోస పట్టదా?
యాచారం: అన్నదాతలు గోస తీస్తున్నా పాలకులకు పట్టింపులేదని రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు కొంతం మాధవరెడ్డి విమర్శించారు. రైతులకు అవసరమైన యూరియా అందించాలని డిమాండ్ చేస్తూ గురువారం యాచారం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అన్నం పెట్టే రైతులు పంటలు పండించడానికి కావాల్సిన ఎరువులు కోసం కడుపు మాడ్చుకుని తెల్లవారుజామునే పీఏసీఎస్‌ల ముందు క్యూలో ఉండాల్సిన దుస్థితి నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు. రైతులకు పూర్తి స్థాయిలో యూరియా అందించకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. అనంతరం తహసీల్దార్ అయ్యప్పకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు చల్లా నారాయణరెడ్డి, నాయకులు జగన్ మోహన్‌రెడ్డి, శ్రీకాంత్, విజయ, అలీముద్దీన్, నీలమ్మ, అనంత్‌రెడ్డి, అండాలు తదితరులు పాల్గొన్నారు.