
పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత
యాచారం: పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని డీఆర్‌డీఓ శ్రీలత పేర్కొన్నారు. స్వచ్ఛతా హీ సేవ పక్షోత్సవాల్లో భాగంగా గురువారం మండలంలోని గడ్డమల్లయ్యగూడలో శ్రమదానం నిర్వహించి, మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, వర్షాలు కురుస్తున్న దృష్ట్యా తాగునీటి ట్యాంకులను శుభ్రంగా ఉంచుకోవాలని, తాగునీటి పైపులు లీకేజీ కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఏటా మొక్కలు నాటడం అలవాటు చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో అడిషనల్ డీఆర్‌డీఓ చరణ్‌సింగ్, ఎంపీడీఓ రాధారాణి, ఎంపీఓ శ్రీలత, ఏపీఓ లింగయ్య తదితరులు పాల్గొన్నారు.