
విద్యుత్ తీగల చోరీ ముఠా అరెస్ట్
కడ్తాల్: పలు వెంచర్లలో విద్యుత్ తీగల చోరీకి పాల్పడుతున్న ముఠాను పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. ఈ మేరకు సీఐ గంగాధర్ పోలీస్ స్టేషన్‌లో వివరాలను వెల్లడించారు. మండల పరిధిలోని వివిధ వెంచర్లలో ఇటీవల దుండగులు విద్యుత్ స్తంభాల నుంచి అల్యూమినియం తీగలను రాత్రి వేళలో ఎత్తుకెళ్లారు. ఈ మేరకు యాజ మానులు ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమో దు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. గురువారం హైదరాబాద్ నుంచి ఆమనగల్లు వైపు అనుమానాస్పదంగా వెళుతున్న కారులో ముఠాను పోలీసులు తనిఖీ చేశారు. వీరు ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన సత్యం చౌబే, ధీరజ్‌కుమార్, ఒడిశాకు చెందిన జనరోహన్, బిహా ర్‌కు చెందిన శ్యామ్‌బాబురామ్‌గా గుర్తించారు. జల్సాలకు అలవాటు పడిన వీరు బృందంగా ఏర్ప డి నగరంలోని జీడిమెట్ల ఉంటూ చోరీలు పాల్పడుతున్నారు. గూగుల్ లోకేషన్ ఆధారంగా కడ్తాల్ పరిధిలో విద్యుత్ తీగల చోరీలకు ప్రణాళికలు రచించా రని పోలీసులు పేర్కొన్నారు. నిందితుల నుంచి రూ.40 వేల నగదు, కారు, రెండు సెల్‌ఫోన్లు, మూ డు కట్టర్లు, స్క్రూ డ్రైవర్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. పరారీలో ఉన్న ధీరజ్‌కుమార్ ఉన్నట్లు చెప్పారు. కేసును చాకచక్యంగా సీసీ కెమెరాలను ఉపయోగించి ఛేదించిన కానిస్టేబుల్ రాంకోటి, రాజశేఖర్‌లను అఅభినందించారు.