
యువతి కిడ్నాప్ కేసులో ముగ్గురి అరెస్ట్
కీసర: నవ వధువును బలవంతంగా తీసుకెళ్లిన కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రేమ వివాహం చేసుకుందన్న కారణంగా పోలీస్ స్టేషన్ పరిధిలోని నర్సంపల్లిలో శ్వేత అనే యువతిని ఆమె తల్లిదండ్రులు బుధవారం బలవంతంగా లాక్కెళ్లారు. దీంతో శ్వేత భర్త ప్రవీణ్ అతడి కుటుంబ సభ్యులు తమకు న్యాయం చేయాలని కోరుతూ గురువారం కీసర పోలీస్‌స్టేషన్ ఎదుట ఆందోళనకు చేపట్టారు. ఈ సందర్భంగా ఇన్‌స్పెక్టర్ ఆంజనేయులు మాట్లాడుతూ శ్వేత కిడ్నాప్ కేసులో ఇప్పటికే ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. శ్వేత ఆచూకీ కోసం రెండు బృందాలను ఏర్పాటు చేశామన్నారు. ఎస్.ఐ శ్రీనివాస్‌రెడ్డితో శ్వేత తండ్రి ఫోన్‌లో మాట్లాడించారు. ప్రస్తుతం ఆమె తల్లిదండ్రుల వద్ద క్షేమంగా ఉన్నట్లు తెలిపారు. త్వరలోనే ఆమెను కీసర పోలీస్‌స్టేషన్‌కు తీసుకువచ్చి భర్తకు అప్పగించనున్నట్లు తెలిపారు.