
పార్కు స్థలాల పరిరక్షణకు చర్యలు
తుర్కయంజాల్:ప్రజా ప్రయోజనార్థం వదిలిన భూములు, పార్కు స్థలాల పరిరక్షణకు కఠిన చర్యలు తీసుకుంటున్నామని మున్సిపల్ కమిషనర్ కె.అమరేందర్‌రెడ్డి తెలిపారు. పురపాలక సంఘం పరిధి ఇంజాపూర్‌లోని సర్వే నంబర్ 95లోని 4వేల గజాల భూమికి చుట్టూ ప్రహరీ నిర్మిస్తుండగా గురువారం స్థానిక రైతులు కొందరు అడ్డుకున్నారు. దీంతో కమిషనర్ ఆదేశాల మేరకు డీఈ భిక్షపతి, ఏఈ చంద్రశేఖర్ రెడ్డిలు అక్కడికి చేరుకుని రైతులతో చర్చించారు. ఈ సందర్భంగా డీఈ మాట్లాడుతూ.. మున్సిపాలిటీకి 4వేల గజాల రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఉందని, దాని ప్రకారమే టెండర్ పిలిచి నిర్మాణం చేపడుతున్నామని పేర్కొన్నారు. దీనిపై అభ్యంతరాలు ఉంటే సర్వే చేయించుకోవాలని, భూమి మీదని తేలితే నిర్మాణ పనులను నిలిపివేస్తామని తెలిపారు.