
హైటెన్షన్ అలైన్‌మెంట్ మార్చండి
కడ్తాల్: హైటెన్షన్ విద్యుత్ లైన్ అలైన్‌మెంట్ మార్చాలని బాధిత రైతులు నాగర్‌కర్నూల్ పార్లమెంట్ సభ్యుడు డాక్టర్ మల్లు రవిని బాధిత రైతులు కోరారు. బుధవారం వారు హైదరాబాద్‌లోని ఎంపీ నివాసంలో కలిసి తమ గోడును వివరించారు. రైతులకు సమాచారం ఇవ్వకుండానే 765 కేవీ హైటెన్షన్ సోలార్ పవర్‌గ్రిడ్‌లైన్‌ను వేయడం సరికాదని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో తాము తీవ్రంగా నష్టపోతున్నామని అలైన్‌మెంట్ మార్చేందుకు చర్యలు తీసుకోవాలని వినతిపత్రం అందజేశారు. ఇందుకు స్పందించిన ఎంపీ మల్లు రవి కలెక్టర్‌కు ఫోన్ చేసి రైతుల సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారని రైతులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీల ఫోరం జిల్లా మాజీ అధ్యక్షుడు గూడూరు శ్రీనివాస్‌రెడ్డి, రైతులు శివరామకృష్ణ, పెంటారెడ్డి, రాములుయాదవ్, గోరటి కృష్ణ, మధుసూదన్‌రెడ్డి, జంగయ్య, రాజేశ్, పర్వత్‌కుమార్, వెంకటేశ్, క్యామ వెంకటేశ్, అభిషేక్‌రెడ్డి, కరీం తదితరులు ఉన్నారు.
ఎంపీ మల్లు రవికి బాధిత రైతుల వినతి