పాడి పరిశ్రమ స్థాపనతో లాభాలు | - | Sakshi
Sakshi News home page

పాడి పరిశ్రమ స్థాపనతో లాభాలు

Sep 25 2025 1:30 PM | Updated on Sep 25 2025 1:30 PM

పాడి పరిశ్రమ స్థాపనతో లాభాలు

పాడి పరిశ్రమ స్థాపనతో లాభాలు

పశువైద్య విశ్వవిద్యాలయం మాజీ రిజిస్ట్రార్‌ కొండల్‌రెడ్డి

షాబాద్‌: మహిళలు, యువత పాడి పరిశ్రమను అభివృద్ధి చేసుకుని లాభాలు ఆర్జించవచ్చునని పశువైద్య విశ్వవిద్యాలయం మాజీ రిజిస్ట్రార్‌ కొండల్‌రెడ్డి అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని ముదిరాజ్‌ భవన్‌లో సేవాస్ఫూర్తి ఫౌండేషన్‌ ప్రాజెక్టు మేనేజర్‌ రత్నాకర్‌, పీవీ నర్సింహారావు తెలంగాణ వెటర్నరీ విశ్వవిద్యాలయం రాజేంద్రనగర్‌ వారి ఆధ్వర్యంలో ‘జిల్లా శాసీ్త్రయ పద్ధతుల డెయిరీసాగు, పాల ఉత్పత్తుల విలువల జోడింపు’ పై ఒక రోజు శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శాసీ్త్రయ పద్ధతిలో పాడి పశువుల పెంపకం, పాల పదార్థాల తయారీపై రైతులకు అవగాహన కల్పించామన్నారు. డైరెక్టర్‌ ఆఫ్‌ ఎక్స్‌టెన్షన్‌ (పీవీఎన్‌టీవీయూ) డాక్టర్‌ కిషన్‌కుమార్‌ మాట్లాడుతూ.. శాసీ్త్రయ పద్ధతుల ఆధారంగా ఆధునిక డెయిరీ ఫారాల స్థాపనపై సూచనలు ఇచ్చారు. పశుపోషణ, షెడ్‌ నిర్మాణం, తక్కువ లాభాలు వంటి అంశాలపై వివరించారు. సేవాస్ఫూర్తి ప్రాజెక్టు మేనేజర్‌ రత్నాకర్‌ మాట్లాడుతూ.. డెయిరీ రంగంలో గ్రామీణ మహిళల సాధికారత అంశంపై పాడి రైతులకు సూచనలు, సలహాలు ఇచ్చారు. ప్రభుత్వ పథకాల వినియోగం, వ్యాపార నైపుణ్యాల సాధన ద్వారా స్వయం ఉపాధి అవకాశాలను సృష్టించుకోవాలని ప్రోత్సహించారు. మజ్జిగ, నెయ్యి, క్రీమ్‌ తయారీపై డెమో ఇచ్చారు. ప్రొఫెసర్‌ శశికుమార్‌, సాహిత్య రాణి, అసోసియేషన్‌ ప్రొఫెసర్‌ లైవ్‌స్టాక్‌, ప్రొడక్ట్‌ టెక్నాలజీ విభాగం ఆధ్వర్యంలో కోవా, కలాకండ్‌, పనీర్‌ చన్నా, రసగుల్లా, రసమలై, బాసుంది, మజ్జి గ, లస్సీ, ప్లేవర్‌ మిల్క్‌ వంటి విలువ ఆధారిత పా ల ఉత్పత్తుల తయారీపై వర్క్‌షాప్‌ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పశువైద్యధికారి స్రవంతి, పాడి రైతులు యాదయ్య, మాణిక్యం, రాములు, శ్రీని వాస్‌, రాజు, గౌరీశ్వర్‌, మహేశ్‌, పూర్ణచందర్‌, ర మ్య, స్వరూప, యజ్ఞశ్రీ, పద్మ, తదితరులున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement