
జీఎస్టీపై అపోహలు నమ్మొద్దు
చేవెళ్ల: జీఎస్టీ తగ్గింపుపై ప్రతిపక్షాల దుష్ప్రచారాలను నమ్మొద్దని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి సూచించారు. బుధవారం ఆయన నియోజకవర్గ కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నంతో కలిసి పర్యటించారు. దుకాణదారులకు జీఎస్టీ తగ్గింపుపై సందేహాలను నివృత్తి చేశారు. ఎలక్ట్రికల్ దుకాణం, కార్లు, బైక్ షోరూంలు, మెడికల్ షాపు తదితర వ్యాపారస్తులను కలిసి జీఎస్టీ తగ్గింపుతో ఎలాంటి ప్రయోజనాలున్నాయో అడిగి తెలుసుకున్నారు. పలువురు దుకాణాదారులు ముందుగానే స్టాక్ తెచ్చుకోవడంతో వ్యాపారులకు నష్టం వాటిల్లుతోందన్నారు. ముందుగా తెచ్చుకున్న వాటి జీఎస్టీ మళ్లీ వెళ్లినప్పుడు తగ్గించి చెల్లిస్తారని చెప్పారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. కేంద్రం ప్రభుత్వం దేశంలోని ప్రజలకు, వ్యాపారులకు మేలు చేకూర్చేందుకే ఈ నిర్ణయం తీసుకుందన్నారు. ప్రతీ ఒక్కరు పన్నులు చెల్లించే విధానంతో వ్యాపార నిర్వహణలో పారదర్శకత పెరిగిందన్నారు. ప్రభుత్వాల ఆదాయం పెరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకుడు ఎస్.ప్రభాకర్‌రెడ్డి, బీజేపీ జిల్లా కార్యదర్శి జి.వెంకట్‌రెడ్డి, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు రాములు, జిల్లా కౌన్సిల్ సభ్యుడు వాసుదేవ్‌కన్నా, వెంకట్‌రాంరెడ్డి, బీజేవైఎం అధ్యక్షుడు సత్యనారాయణ, మానిక్యరెడ్డి, జి.కృష్ణగౌడ్, నాయకులు కృష్ణమోహన్, ప్రవీణ్, కృష్ణ, నర్సింలు, కృష్ణారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి