
27న కలెక్టరేట్‌లో బతుకమ్మ సంబురాలు
తుక్కుగూడ: టీజీఓఎస్ ఆధ్వర్యంలో ఈ నెల 27న కలెక్టర్ కార్యాలయంలో బతుకమ్మ సంబురాలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ నారాయణరెడ్డి తెలిపారు. బుధవారం ఆయన ఉత్సవాలకు సంబంధించిన వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. ఉత్సవాలను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీజీఓ సంఘం జిల్లా అధ్యక్షుడు డాక్టర్ కె.రామారావు, కార్యదర్శి శ్రీనేశ్ కుమార్, నాయకులు శాంతిశ్రీ, మహేశ్వరి, పద్మావతి, అలివేలు, సైదమ్మ, వెంకటేశ్, లక్ష్మణస్వామి, రాకేశ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ నారాయణరెడ్డి