
ప్లాస్టిక్ గోదాంలో అగ్ని ప్రమాదం
పహాడీషరీఫ్: ప్లాస్టిక్ గోదాంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ సంఘటన బుధవారం తెల్లవారు జామున చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీరాం కాలనీలోని ఇందిరా సొసైటీలో మధుబన్ కాలనీకి చెందిన శేషు, ప్లాస్టిక్ రీసైక్లింగ్ గోదాం నిర్వహిస్తున్నారు. ఉదయం 4 గంటల సమయంలో కర్మాగారంలో అగ్ని కీలలు ఎగిసి పడ్డాయి. గమనించిన స్థానికులు పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించగా.. వారు ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పారు. అప్పటికే అందులోని ప్లాస్టిక్ స్క్రాప్ పూర్తిగా కాలిపోయింది. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని, రూ.8 లక్షల ఆస్తి నష్టం వాటిల్లిందని యజమాని తెలిపారు. ఎలాంటి ఫిర్యాదు అందనందున కేసు నమోదు చేయలేదని పోలీసులు చెప్పారు.