
భక్తి భావంతో మానసిక ప్రశాంతత
కడ్తాల్: ప్రతి ఒక్కరూ భక్తిమార్గం ఎంచుకోవాలని, తద్వారా మానసిక ప్రశాంతత లభిస్తుందని ఎల్‌హెచ్‌పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జర్పుల దశరథ్‌నాయక్ అన్నారు. బుధవారం మండల పరిధి మద్దెలకుంట తండాలో సంత్ సేవాలాల్ మహారాజ్ మాలధారణ భక్తుల ఆధ్వర్యంలో ఇరుముడి పూజా కార్యక్రమం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా దశరథ్‌నాయక్ మాట్లాడుతూ.. సేవాలాల్ సత్యం,ఽ ధర్మం, సమానత్వం, ఽభక్తి విలువలు బోధించారని, ఆయన చూపిన మార్గంలో యువత నడుచుకోవాలని సూచించారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు సమాజశాంతికి దోహదపడతాయని తెలిపారు. ఇందులో మాజీ సర్పంచ్ కస్ననాయక్ పాల్గొన్నారు.
ఘనంగా సీఎం సతీమణి పుట్టినరోజు
మాడ్గుల: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సతీమణి గీత పుట్టినరోజు వేడుకలు ఆమె స్వగ్రామం మాడ్గుల మండల కేంద్రంలో బుధవారం ఘనంగా జరిగాయి. రేవంత్ మిత్ర మండలి రాష్ట్ర అధ్యక్షుడు ఆసీఫ్ ఆలీ ఆధ్వర్యంలో కేక్‌కట్ చేసి, బాణసంచా కాల్చారు. శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు జంగయ్య, పాండు గౌడ్, భాస్కర్, కష్ణయ్య, శివ తదితరులు పాల్గొన్నారు.
కుమార్తైపె లైంగిక దాడి.. తండ్రికి జీవిత ఖైదు
జగద్గిరిగుట్ట: కుమార్తైపె లైంగికదాడికి పాల్పడిన కేసులో నిందితుడికి జీవిత ఖైదు విధించారు. పోలీసుల వివరాల ప్రకారం..జగద్గిరిగుట్ట అంజయ్యనగర్‌కు చెందిన అనిల్‌గౌడ్ తన కుమార్తైపె పలుమార్లు పాల్పడగా..బాధితురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు గత సంవత్సరం ఏప్రిల్‌లో కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.