
జీఎస్టీ తగ్గింపుతో ప్రయోజనం
షాద్‌నగర్: కేంద్ర ప్రభుత్వం తగ్గించిన జీఎస్టీతో పేద, మధ్య తరగతి ప్రజలకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాజ్‌భూపాల్‌రెడ్డి అన్నారు. పట్టణంలోని ఏబీ కాంప్లెక్స్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశాన్ని అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి చేసేందుకు ప్రధాని మోదీ సంస్కరణలు చేపట్టారని తెలిపారు. జీఎస్టీ తగ్గింపుతో నిత్యావసరాలతో పాటు మందులు, వస్త్రాలు, క్రీడా, ఎలక్ట్రానిక్ వస్తువులు, వాహనాల రేట్లు ఎంతో తగ్గాయన్నారు. దీంతో సామాన్యుల ఆదాయంలో 20శాతం ఆదా జరుగుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వ పనితీరుపై సీఎం రేవంత్‌రెడ్డి గాలిమాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అందె బాబయ్య, శ్రీవర్ధన్‌రెడ్డి, నాయకులు డాక్టర్ విజయ్‌కుమార్, కక్కునూరి వెంకటేశ్‌గుప్తా, దేపల్లి అశోక్‌గౌడ్, హరిభూషణ్ పటేల్, మురళి, శ్యాంసుందర్, మోహన్‌సింగ్, చెట్ల వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.
బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాజ్‌భూపాల్‌రెడ్డి