
రైతులందరికీ యూరియా అందిస్తాం
షాబాద్: రైతులందరికీ అవసరమైన ఎరువులు అందించాలని, ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని జిల్లా వ్యవసాయాధికారి ఉష పేర్కొన్నారు. మండల కేంద్రంలోని సహకార సంఘం కార్యాలయంలోని యూరియా గోదాంను మంగళవారం తనిఖీ చేశారు. అనంతరం మాచన్‌పల్లి రైతువేదికలో నిర్వహించిన రైతునేస్తం కార్యక్రమానికి హాజరై రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె డీలర్లు, అధికారులకు పలు సూచనలు చేశారు. యూరియా అందించడంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. రైతులు కూడా సంయమనం పాటించాలని సూచించారు. అవసరం మేరకు యూరి యా అందుబాటులో ఉందని, అందరికీ అందిస్తామని, ఎవరూ ఆందోళన చెందొద్దని తెలిపారు. కార్యక్రమంలో సహకార సంఘం చైర్మన్ చల్లా శేఖర్‌రెడ్డి, ఏడీఏ సురేశ్‌బాబు, ఏఓ కృష్ణమోహన్, ఏఈ ఓలు శివతేజ, కిరణ్మయి, రాజేశ్వరి పాల్గొన్నారు.
జిల్లా వ్యవసాయాధికారి ఉష