నార్త్‌ జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్‌గా చంద్రశేఖర్‌ | - | Sakshi
Sakshi News home page

నార్త్‌ జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్‌గా చంద్రశేఖర్‌

Sep 24 2025 8:16 AM | Updated on Sep 24 2025 8:16 AM

నార్త్‌ జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్‌గా చంద్రశేఖర

నార్త్‌ జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్‌గా చంద్రశేఖర

నగర కమిషనరేట్‌లో ఆరుగురు అధికారుల బదిలీ

సాక్షి, సిటీబ్యూరో: ఉత్తర మండల టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్‌గా కమతం చంద్రశేఖర్‌ నియమితులయ్యారు. ఈయనతో పాటు మొత్తం ఆరుగురు ఇన్‌స్పెక్టర్లను బదిలీ చేస్తూ కొత్వాల్‌ సీవీ ఆనంద్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం చంద్రశేఖర్‌ సీసీఎస్‌లో పనిచేస్తున్నారు. ఈయన స్థానంలోకి నార్త్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్‌ పసుల రాఘవేంద్రను బదిలీ చేశారు. వీరితో పాటు ఎస్‌.విష్ణువర్థన్‌రెడ్డిని బండ్లగూడ డీఐ, బి.శ్రీనివాసరావును చాదర్‌ఘాట్‌ డీఐ, డి.రాజేందర్‌గౌడ్‌ను ఐటీ సెల్‌ ఇన్‌స్పెక్టర్‌, సీహెచ్‌ సురేష్‌ బాబును యాంటీ హ్యూమన్‌ ట్రాఫికింగ్‌ యూనిట్‌ ఇన్‌స్పెక్టర్‌గా బదిలీ చేశారు.

డ్రగ్స్‌ విక్రేతల అరెస్టు

రాజేంద్రనగర్‌: ఉన్నత చదువులు చదివి..దురలవాట్లకు బానిసై..డబ్బు అవసరాలు తీర్చుకునేందుకు మత్తు పదార్థాల విక్రేతలుగా మారిన ముగ్గుర్ని మంగళవారం బుద్వేల్‌ బన్సీలాల్‌నగర్‌ ప్రాంతంలో పట్టుకున్నారు. ఎకై ్సజ్‌ టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్‌ నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం..యాదాద్రి బీబీనగర్‌కు చెందిన మహ్మద్‌ అన్వర్‌, అచ్చంపేటకు చెందిన వాసు బీటెక్‌ విద్యార్థులు. చదువుకునేందుకు నగరానికి వచ్చి చాంద్రాయణగుట్ట ప్రాంతంలో నివసిస్తున్నారు. వీరికి అదే ప్రాంతానికి చెందిన మజ్హర్‌ అలీతో స్నేహం ఏర్పడింది. వీరంతా దురలవాట్లకు బానిసయ్యారు. తమ అలవాట్లను తీర్చుకునేందుకు డబ్బు అవసరమై డ్రగ్స్‌ విక్రయించాలని నిర్ణయించుకున్నారు. బెంగళూరుకు వెళ్లి ఎండీఎంఏ మాత్రలు, వైజాగ్‌కు వెళ్లి గంజాయిని తీసుకొచ్చారు. వీటిని తమకు తెలిసిన వారికి విక్రయించడం ప్రారంభించారు. దీనిపై సమాచారం అందుకున్న ఎకై ్సజ్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు మంగళవారం ఉదయం బుద్వేల్‌ బన్సీలాల్‌నగర్‌ రోడ్డు గుండా వెళుతున్న సమయంలో పట్టుకొని సోదాలు చేశారు. నిందితుల వద్ద కిలోన్నర గంజాయి, 6.6 గ్రాముల ఎండీఎంఏ మాత్రలు లభించాయి. నిందితులను పట్టుకొని తదుపరి విచారణ నిమిత్తం శంషాబాద్‌ ఎకై ్సజ్‌ పోలీసులకు అప్పగించారు.

యువకుడిపై దాడి చేసి బంగారు గొలుసు చోరీ

మణికొండ: కారు చెడిపోయి..రోడ్డు పక్కగా నిల్చున్న ఓ యువకుడిపై ఆరుగురు వ్యక్తులు దాడి చేసి కొట్టి..అతని వద్ద ఉన్న 10 గ్రాముల బంగారు గొలుసు, ఐ ఫోన్‌ను చోరీ చేసిన సంఘటన నార్సింగి పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని కోకాపేట నియోపోలీస్‌ గుట్టపై సోమవారం రాత్రి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బోరబండకు చెందిన బి.సునీల్‌ భాస్కర్‌ సోమవారం రాత్రి 11.30 గంటలకు గౌలిదొడ్డి వైపు నుంచి కోకాపేట నియోపోలిస్‌ వెంచర్‌కు వెళ్లాడు. అక్కడ కారు చెడిపోవటంతో రోడ్డు పక్కన ఆపి అతని సోదరుడు శేఖర్‌కు సమాచారం ఇచ్చాడు. రాత్రి 11.55 గంటల సమయంలో రెండు ద్విచక్ర వాహనాలపై వచ్చిన ఆరుగురు గుర్తు తెలియని అతన్ని కొట్టి మెడలోని బంగారు చైన్‌, జేబులోని ఐఫోన్‌ను లాక్కుని పారిపోయారు. బాధితుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement