
ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసే పాలన
తుర్కయంజాల్: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసే పాలన చేస్తుందని బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి విమర్శించారు. మంగళవారం పురపాలక సంఘం పరిధి ఇంజాపూర్‌కు చెందిన బొక్క మురళీధర్ రెడ్డి బెయిల్‌పై ఇటీవల విడుదల కావడంతో ఆయన ఇంటికి చేరుకుని కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలపై కాంగ్రెస్ ప్రభుత్వం పెడుతున్న కేసులకు భయపడే ప్రసక్తే లేదని, వాట్సాప్‌లో పెట్టిన పోస్టు ఆధారంగా పలు సెక్షన్‌ల కింద కేసులను బనాయించి జైలుకు పంపడం సరైనది కాదన్నారు. రాజకీయ నాయకుల ఒత్తిళ్లకు పోలీసులు, అధికారులు తలొగ్గి పనిచేయడం హేయమన్నారు. ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డికి నియోజకవర్గం అభివృద్ధిపైన ధ్యాసే లేదని, కేవలం వసూళ్ల మీదే ఉందని ఆరోపించారు. తుర్కయంజాల్ మున్సిపాలిటీలో అధికార పార్టీ నేతలు కబ్జాలకు పాల్పడుతున్నారని చెప్పారు. కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి జిల్లా మాజీ అధ్యక్షుడు వంగేటి లక్ష్మారెడ్డి, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ వెంకటరమణారెడ్డి, నాయకులు ఆనంద్‌రెడ్డి, కల్యాణ్‌నాయక్, కె.లక్ష్మారెడ్డి, మల్లేశ్, చంద్రశేఖర్‌రెడ్డి, చిన్నయ్య, దశరథ, సంపతీశ్వర్‌రెడ్డి, అశోక్, గౌతమ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు కిషన్‌రెడ్డి