
భారీగా నల్లబెల్లం పట్టివేత
కడ్తాల్: ఎకై ్సజ్ పోలీసుల తనిఖీల్లో భారీగా నల్లబెల్లం, పటిక పట్టుబడిన సంఘటన కడ్తాల్ టోల్‌ప్లాజా వద్ద చోటు చేసుకుంది. ఆమనగల్లు ఎకై ్సజ్ సీఐ బద్యానాథ్ చౌహాన్ తెలిపిన వివరాల ప్రకారం.. దసరా పండుగకు సారా తయారీ కోసం నల్లబెల్లాన్ని హైదరాబాద్ నుంచి వివిధ గ్రామాలకు తరలిస్తున్నారనే విశ్వసనీయ సమాచారం అందడంతో మంగళవారం తెల్లవారు జామున ఎకై ్సజ్ సిబ్బంది కడ్తాల్ టోల్‌ప్లాజా వద్ద వాహన తనిఖీలు చేపట్టింది. ఇందులో అనుమానాస్పదంగా నిలిపి ఉన్న వాహనాన్ని తనిఖీ చేయగా.. 65 బ్యాగుల్లో సుమారు 1,950 కిలోల నల్లబెల్లం, 40 కిలోల పటిక స్వాధీనం చేసుకున్నారు. మరో వాహనాన్ని తనిఖీ చేయగా సుమారు 300 కిలోల నల్లబంె ఫౌడర్, 10 కిలోల పటికను స్వాధీనం చేసుకున్నామని సీఐ తెలిపారు. ఈ మేరకు నల్లబెల్లం తరలిస్తున్న మహర్షి, కాశీం, ఎల్లస్వామిలపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు. దాడుల్లో మొత్తం 2,250 కిలోల సారాముడి పదార్థాలతో పాటు, రెండు వాహనాలను, 50 కిలోల పటికను సీజ్ చేసినట్లు వివరించారు. ఈ దాడుల్లో ఎస్‌ఐ అరుణ్‌కుమార్, హెడ్ కానిస్టేబుల్ శంకర్, సిబ్బంది లోక్యా, బాబు, ఉపేందర్, ఆమని తదితరులు ఉన్నారు.
కడ్తాల్ టోల్‌ప్లాజా వద్ద ఎకై ్సజ్ పోలీసుల తనిఖీలు