
తప్పని యూరియా తిప్పలు
తెల్లవారు జాము 4గంటలకే క్యూలైన్లో రైతులు
నందిగామ: యూరియా కో సం అన్నదాతలు అష్టకష్టాలు పడుతున్నారు. రేయింబవళ్లు పీఏసీఎస్ వద్ద పడిగాపులు కాస్తున్నారు. చెప్పులు, రాళ్లు క్యూలైన్లో పెట్టి నిరీక్షిస్తున్నారు. మండల పరిధి చేగూరు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘానికి సోమవారం యూరియా వస్తుందనే సమాచారంతో పరిసర గ్రామాల రైతులు పెద్ద ఎత్తున తెల్లవారు జామున 4 గంటలకు కేంద్రం వద్ద బారులు తీరారు. అనంతరం లారీలో 450 బస్తాల యూరియా వచ్చింది. పోలీసుల సహకారంతో నిర్వాహకులు పంపిణీ చేశారు. చాలా మందికి యూరియా అందకపోవడంతో ఆందోళన వ్యక్తం చేస్తూ.. నిరాశతో వెనుతిరిగారు.
ర్యాగింగ్‌కు పాల్పడితే శిక్ష తప్పదు
సీఐ నాగరాజుగౌడ్
హయత్‌నగర్: ర్యాగింగ్‌కు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీఐ నాగరాజుగౌడ్ హెచ్చరించారు. సోమవారం పెద్దఅంబర్‌పేట్ మున్సిపాలిటీ కుంట్లూర్ పల్లవి ఇంజినీరింగ్ కళాశాలలో ర్యాగింగ్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ర్యాగింగ్ పేరుతో తోటి విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం, మాసికంగా వేధించడం తగదని సూచించారు. కొత్తగా వచ్చే వారిపట్ల సోదర భావంతో మెలగాలని, కలిసిమెలసి చదువుకోవాలని చెప్పారు. క్రమశిక్షణ పట్టుదలతో విద్యనభ్యసించి, భవిష్యత్తును చక్కదిద్దుకోవాలన్నారు. ర్యాగింగ్‌కు పాల్పడితే.. జైలు జీవితం గడపాల్సి వస్తుందని హెచ్చరించారు. ఒక్కసారి శిక్ష అనుభవిస్తే.. అది జీవితాంతం వెంటాడుతుందని, జీవితం అంధకారం అవుతుందని వివరించారు. కళాశాలలో ఎవరికి ఎలాంటి ఇబ్బంది వచ్చినా పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.
నాగోలు: అనుమానాస్పద స్థితిలో ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. నాగోలు పోలీసులు తెలిపిన మేరకు.. మహబూబాబాద్ జిల్లా రెడ్డాల గ్రామంలో బోడ స్వరూప(35), బోడ రవి దంపతులు నివాసముంటున్నారు. ఈ క్రమంలో అనిల్ కుమార్‌తో స్వరూపకు పరిచయం ఏర్పడింది. దీంతో దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో అనిల్ మాయ మాటలు నమ్మిన స్వరూప ఈ నెల 21న నాగోలు బ్‌లైండ్ కాలనీలో నివాసం ఉండే అనిల్ కుమార్ దగ్గరకు వచ్చింది.స్వరూప హైదరాబాద్‌కు చేరుకున్న విషయం తెలుసుకున్న భర్త ఫోన్ చేయగా తాను అనిల్‌తో ఉన్నాను అని చెప్పింది. ఆదివారం రాత్రి అనిల్ కుమార్ నివాసంలో అనుమానాస్పద స్థితిలో బాత్‌రూమ్‌లో ఆత్మహత్య చేసుకొని కనిపించింది.స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా పోలీసులు సంఘటన స్థలానికి చేరుకోని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకోని అనిల్‌కుమార్‌ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

తప్పని యూరియా తిప్పలు