
దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలి
సాక్షి, సిటీ బ్యూరో: మహబూబాబాద్ ప్రభు త్వ ఆసుపత్రి సూపరింటెండెంట్, వైద్యులపై దాడికి పాల్పడిన వారిని చట్టపరంగా శిక్షించాలని తెలంగాణ టీచింగ్ ప్రభుత్వ డాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు బి.కిరణ్, ప్రధాన కార్యదర్శి మాదాల కిరణ్, కోశాధికారి ఎల్.రమేష్‌లు ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. సోమవారం ఉదయం సుమారు 150 మంది సూపరింటెండెంట్ కార్యాలయాన్ని చుట్టుముట్టి చంపేస్తామంటూ బెదిరించడం క్షమించరాని నేరమన్నారు. వైద్యులుపై వివిధ ప్రాంతాల్లో నిత్యం దాడులు జరుగుతున్నాయని, వీటిని అరికట్టకుంటే పనిచేయలేమని పేర్కొన్నారు. జిల్లా పోలీసు యంత్రాంగం వెంటనే నిందితులను అరెస్టు చేసి, చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కోరారు.
25 వరకు ప్రధాని ఫొటో ఎగ్జిబిషన్
గన్‌ఫౌండ్రీ: ప్రధానమంత్రి నరేంద్రమోదీ జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ నెల 25 వరకు నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో ఫొటో ఎగ్జిబిషన్‌ను ప్రదర్శించనున్నట్లు బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు, తెలిపారు. నరేంద్రీ చేసిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రలకు తెలియజేసేలా నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో బీజేపీ రాష్ట్ర శాఖ ఆధ్వ్యంలో ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను ఆయన ప్రారంభించారు. మోదీ జన్మదినాన్ని పురస్కరించుకొని సేవా పక్షం కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పార్లమెంటు సభ్యులు డీకే అరుణ, కొండా విశ్వేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.