
అగ్రసేన్ మహారాజ్ స్ఫూర్తితో రాష్ట్రాభివృద్ధి
శంషాబాద్: సేవే నిజమైన సంపద అని చాటి చెప్పిన అగ్రసేన్ మహారాజ్ స్ఫూర్తితో రాష్ట్రాభివృద్ధి వైపు ప్రభుత్వం అడుగులు వేస్తోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి డి. శ్రీధర్‌బాబు అన్నారు. శంషాబాద్ క్లాసిక్ కన్వెన్షన్‌లో తెలంగాణ అగర్వాల్ సమాజ్ ఆధ్వర్యంలో సోమవారం రాత్రి అగ్రసేన్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. అగ్రసేన్ గొప్పసామాజిక శిల్పి అని ఆయన కొనియాడారు. ఆయన ప్రవేశ పెట్టిన ఒక ఇటుక.. ఒక నాణేం అన్న సూత్రం ప్రపంచంలోనే మొదటి స్టార్టప్ ఇన్‌క్యూబేటర్ అని పేర్కొన్నారు, సంపద కొద్దిమందికే పరిమితం చేయకుండా సమాజంలో పంపిణీ చేసినపుడే అభివృద్ధి సాధ్యమని నిరూపించిన మహానీయుడన్నారు. కార్యక్రమంలో అగర్వాల్ సమాజ్ అధ్యక్షుడు అనిరుధ్ గుప్తా, ఉపాధ్యక్షుడు రూపేష్ అగర్వాల్ పాల్గొన్నారు.
ఐటీ, పరిశ్రమల శాఖమంత్రి శ్రీధర్‌బాబు