
విద్యారత్న అవార్డు ప్రదానం
మంచాల: గ్రామీణ నిరుపేద విద్యార్థుల ఉన్న తి కోసం పాటుపడిన డాక్టర్ ఎస్.కె.భిక్షపతి ప్రొఫెసర్ జయశంకర్ విద్యారత్న అవార్డు అందుకున్నారు. రవీంద్రభారతిలో సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుడు ఏనుగు నర్సింహారెడ్డి అవార్డు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా భిక్షపతి మాట్లాడుతూ.. అవార్డు అందుకోవడం సంతోషంగా ఉందని, తన బాధ్య తను మరింత పెంచిందన్నారు.
శంకర్‌పల్లి: మండలంలోని చందిప్ప వద్ద ఉన్న మరకత శివాలయంలోని శివలింగాన్ని సినీ హీరో నారా రోహిత్ దర్శించుకున్నారు. ఆదివారం రాత్రి ఆలయానికి వచ్చిన ఆయన అక్కడే బస చేసి సోమవారం తెల్లవారుజామున బ్రహ్మముహూర్తంలో శివలింగానికి అభిషేకం, ప్రత్యేక పూజలు చేశారు. ఈ సంద ర్భంగా మాట్లాడుతూ.. మరకత శివలింగాన్ని దర్శించుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. అనంతరం ఆలయ చైర్మన్ గోపాల్‌రెడ్డి, ప్రధాన అర్చకులు సాయిశివ, ప్రమోద్ ఆయనను శాలువాతో సన్మానించి మరకత శివలింగం ఫొటోను అందించారు.
కందుకూరు: స్థానిక పీఏసీఎస్ చైర్మన్‌ను తొలగించి కొత్తవారిని నియమిస్తూ ఇచ్చిన ఉత్తర్వును వెనక్కి తీసుకోవాలని పాలకవర్గ సభ్యులు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు జిల్లా కోఆపరేటివ్ కార్యాలయంలో డీసీఓ సుధాకర్‌కు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఇప్పటి వరకు పనిచేసిన చైర్మన్ చంద్రశేఖర్‌పై తప్పుడు అభియోగాలు మోపుతూ, ఎలాంటి విచారణ చేపట్టకుండా తొలగించి, కొత్తగా వెంకట్రామ్‌రెడ్డిని ఏకపక్షంగా నియమించడం సరికాదన్నారు. ఉత్తర్వులను రద్దు చేసి పాత చైర్మన్‌నే కొనసాగించాలని కోరారు. కార్యక్రమంలో తొలగించిన చైర్మన్ డి.చంద్రశేఖర్, సభ్యులు జి.విజేందర్‌రెడ్డి, ఎస్.శేఖర్‌రెడ్డి, ఎన్.నరసింహ, జి.పర్వతాలు, జి.అంజమ్మ, జి.వెంకటేశ్, కె.యశోద, ఎం.చంద్రునాయక్, పి.ఆనంద్ పాల్గొన్నారు.
కేశంపేట: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వనమహోత్సవం అభాసుపాలవుతోంది. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో క్షేత్రస్థాయిలో కార్యక్రమం సరిగా అమలు కావడం లేదు. మండల పరిధిలోని కొత్తపేటలో జాతీయ ఉపాధి హామీ పథకం కింద నర్సరీ ఏర్పాటు కోసం మొరం మట్టి, ఎర్రమట్టి, సర్వీస్ వైర్, ఎరువులు తదితరాల కోసం సుమారు రూ.40వేలు పంచాయతీ ఎన్‌ఆర్‌జీఎస్ నిధులు ఖర్చు చేసింది. మొక్కల పెంపకం కోసం ప్రభుత్వం మరిన్ని నిధులు అందించింది. పంచాయతీల్లో 10వేల మొక్కలు నాటేందుకు సిద్ధమైంది. వీటికి అదనంగా మరో మూడువేల మొక్కలు పెంచాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలో మండలంలో జాతీయ ఉపాధి హామీ పథకానికి సంబంధించిన నిధులపై ఆడిట్ జరుగుతోంది. నర్సరీలో ఉన్న మొక్కలు ఎండిపోయిన విషయాన్ని అధికారులు ఎక్కడ గుర్తిస్తారోననే భయంతో పంచాయతీ కార్యదర్శి జగన్ గ్రామానికి చెందిన కొందరి కూలీల సాయంతో సోమవారం వాటిని పంచాయతీ ట్రాక్టర్‌లో గ్రామ శివారులోని చెత్త వేసే ప్రాంతంలో పారబోశారు.

విద్యారత్న అవార్డు ప్రదానం

విద్యారత్న అవార్డు ప్రదానం