
పొలాల నుంచి ట్రిపుల్‌ఆర్ వద్దు
షాద్‌నగర్: రైతులు పంటలు పండించే పొలాల నుంచి ట్రిపుల్ ఆర్ రోడ్డును నిర్మించొద్దని, అలైన్‌మెంట్‌ను వెంటనే మార్చాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ డిమాండ్ చేశారు. రీజినల్ రింగ్ రోడ్డు నిర్మించబోయే షాద్‌నగర్ పరిధిలోని అయ్యవారిపల్లి శివారులోని వ్యవసాయలను సోమవారం ఆయన పరిశీలించారు. రైతులతో మాట్లాడి వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పంటలు పండే పచ్చని పొలాల గుండా ట్రిపుల్‌ఆర్ రోడ్డు నిర్మిస్తే ఎంతో విలువైన భూములను కోల్పోవడంతో పాటు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్న రైతులు రోడ్డును పడాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. రైతులను ఇబ్బందులకు గురి చేసి బలవంతంగా భూములు తీసుకునేందుకు ప్రయత్నిస్తే చూస్తూ ఊరుకోమన్నారు. పాత అలైన్‌మెంట్ ప్రకారమే ట్రిపుల్‌ఆర్ రోడ్డు నిర్మించాలని లేని పక్షంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి పగడాల యాదయ్య, డివిజన్ కార్యదర్శి రాజు, నాయకులు శ్రఋను నాయక్, సాయిబాబ, ఈశ్వర్, కుర్మయ్య, పద్మారెడ్డి, మహహ్మద్, బాబు, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
రైతులను రోడ్డున పడేయొద్దు
వెంటనే అలైన్‌మెంట్ మార్చాలి
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ