ప్రజావాణిని నిర్లక్ష్యం చేయొద్దు | - | Sakshi
Sakshi News home page

ప్రజావాణిని నిర్లక్ష్యం చేయొద్దు

Sep 23 2025 11:08 AM | Updated on Sep 23 2025 11:08 AM

ప్రజావాణిని నిర్లక్ష్యం చేయొద్దు

ప్రజావాణిని నిర్లక్ష్యం చేయొద్దు

ప్రజావాణిని నిర్లక్ష్యం చేయొద్దు

ఇబ్రహీంపట్నం రూరల్‌: ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి అన్ని శాఖల జిల్లాస్థాయి అధికారులు తప్పనిసరి హాజరుకావాలని అడిషనల్‌ కలెక్టర్‌ చంద్రారెడ్డి పేర్కొన్నారు. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో డీఆర్‌ఓ సంగీతతో కలిసి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలు ఇబ్బందులు పడకుండా చూడాలని, అర్జీలను పెండింగ్‌లో పెట్టకుండా తక్షణమే పరిష్కరించేలా చర్యలు చేపట్టాలన్నారు. ఈ వారం 40 ఫిర్యాదులు వచ్చినట్టు తెలిపారు. కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, మున్సిపల్‌ అధికారులు, తహసీల్దారులు, కలెక్టరేట్‌ సూపరిండెంట్‌లు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement