ప్రపంచ సంక్షేమాన్ని కాంక్షించే దేశం భారత్‌ | - | Sakshi
Sakshi News home page

ప్రపంచ సంక్షేమాన్ని కాంక్షించే దేశం భారత్‌

Sep 22 2025 8:28 AM | Updated on Sep 22 2025 8:28 AM

ప్రపం

ప్రపంచ సంక్షేమాన్ని కాంక్షించే దేశం భారత్‌

ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రాంత ప్రచారక్‌ లింగం శ్రీధర్‌ జీ

ఆర్‌ఎస్‌ఎస్‌ శతాబ్ది ఉత్సవాలు ప్రారంభం

బండ్లగూడ: ప్రపంచ సంక్షేమాన్ని కాంక్షించే దేశం భారత దేశం అని, ప్రపంచానికి ధర్మాన్ని అందించే దేశమని రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ ప్రాంత ప్రచారక్‌ లింగం శ్రీధర్‌ జీ అన్నారు. బండ్లగూడ జాగీర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని శ్రీ శారదా ధామం ప్రాంతంలోని మైదానంలో రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ శతాబ్ది ఉత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... చరిత్ర తన కళ్లు తెరవకపోయినా అప్పటి నుంచే భారత్‌లోని హింధూ ధర్మం ప్రపంచానికి సత్యం, ధర్మం, ఆధ్యాత్మిక మార్గాన్ని చూపిస్తూనే ఉందన్నారు. ఇది పురాతన కాలం నుంచి కొనసాగుతుందన్నారు. ప్రపంచానికి ఎప్పుడు ఏ రకమైన అవసరం ఏర్పడినా భారత్‌ మాత్రం సిద్ధంగా ఉందన్నారు. స్వాతంత్రానంతరం పరిస్థితులు, అప్పటి చరిత్ర చూస్తే చరిత్ర ఆధారంగా కూడా పరిశీలిస్తే భారత్‌ వైభవం వెలిగిపోతుందని ఎవరూ అనుకోలేదని, కానీ ప్రపంచంలో భారత్‌ ఇప్పుడు ఉన్నత శిఖరాల్లో ఉందని హర్షం వ్యక్తం చేశారు. విశ్రాంత రాయబారి (రిటైర్డ్‌ ఐఎఫ్‌ఎస్‌) అధికారి సంఘం సేవకులు టి.నాగేంద్రప్రసాద్‌, 200 మంది స్వయం సేవకులు, కుటుంబాలతో పాల్గొన్నారు.

రూ.1.6 కోట్లతో సిటీ పోలీసు

వాహనాలకు మరమ్మతులు

సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్‌ సిటీ కమిషనరేట్‌లోని 188 వాహనాలకు అధికారులు మరమ్మతులు చేయించారు. దీనికోసం నగర పోలీసు కమిషనర్‌ సీవీ ఆనంద్‌ రూ.1.6 కోట్లు కేటాయించారు. అధికారులు వినియోగించే వాటితో పాటు గస్తీ వాహనాలకు రిపేర్లు చేయడంతో పాటు టీఎస్‌గా ఉన్న స్టిక్కరింగ్‌ను టీజీగా మార్చి, తెలంగాణ స్టేట్‌ పోలీసు అనే స్టిక్కర్ల స్థానంలో తెలంగాణ పోలీస్‌ పేరు ఏర్పాటు చేశారు.

నెక్లెస్‌ రోడ్డులో కార్డియాక్‌ రీ హబ్‌ రన్‌

ఖైరతాబాద్‌ : గుండె ఆరోగ్యంపై అవగాహన కల్పించేందుకు హైదర్‌గూడ అపోలో హాస్పిటల్‌, కార్డియాక్‌ రీహబ్‌ ఫౌండేషన్‌ సహకారంతో నెక్లెస్‌ రోడ్డులో కార్డియాక్‌ రీ హబ్‌ రన్‌ ఆదివారం నిర్వహించారు. యువకుల్లో గుండెపోటు పెరగడానికి కారణం జీవనశైలి, ఒత్తిడి, జంక్‌ఫుడ్స్‌ ప్రధాన కారణమని అపోలో హాస్పిటల్స్‌ హైదర్‌గూడ సీనియర్‌ కన్సల్టెంట్‌ కార్డియాలజిస్ట్‌ డాక్టర్‌ రాజీవ్‌ గార్గ్‌ అన్నారు. సంస్థ తెలంగాణ రీజినల్‌ సీఈఓ తేజస్వీరావు వీరవల్లి మాట్లాడుతూ ప్రతిరోజు వ్యాయామం, పౌష్టిక ఆహారం తీసుకోవడంతో పాటు ఒత్తిడి లేని జీవితాన్ని గడపాలని సూచించారు. దేశంలోనే మొదటి అడ్వాన్స్‌ కార్డియాక్‌ రీహబ్‌ సెంటర్‌గా హైదర్‌గూడ కేంద్రంలో ఇప్పటికే 120 మందికి పైగా రోగులకు ప్రయోజనం చేకూరిందన్నారు. ఈ సందర్భంగా గుండెపోటు నుంచి బయటపడ్డ వారు.. వారి అనుభవాలను పంచుకున్నారు. కార్డియాక్‌ రీ హబ్‌ రన్‌లో అపోలో హాస్పిటల్స్‌ రీజినల్‌ సీఓఓ డాక్టర్‌ రాచపల్లి రెడ్డయ్యప్పరెడ్డి, హైదర్‌గూడ యూనిట్‌ హెడ్‌ సుజాత హెల్డాతో పాటు డాక్టర్లు, ఉద్యోగులు పాల్గొన్నారు.

ప్రపంచ సంక్షేమాన్ని కాంక్షించే దేశం భారత్‌
1
1/2

ప్రపంచ సంక్షేమాన్ని కాంక్షించే దేశం భారత్‌

ప్రపంచ సంక్షేమాన్ని కాంక్షించే దేశం భారత్‌
2
2/2

ప్రపంచ సంక్షేమాన్ని కాంక్షించే దేశం భారత్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement