
కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య
శంకర్‌పల్లి: కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన శంకర్‌పల్లి పట్టణంలో చోటు చేసుకుంది. సీఐ శ్రీనివాస్‌గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. మున్సిపాలిటీ పరిధిలోని అయ్యప్పరెడ్డి గూడేనికి చెందిన కుమ్మరి దశరథ్(38) కొన్నేళ్లుగా మద్యానికి బానిసయ్యాడు. ఏ పని చేయకుండా ఖాళీగా తిరుగుతూ ఉండేవాడు. ఆయనకి భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. దశరథ్‌కి అనారోగ్య సమస్యలు రావడంతో డాక్టర్ మద్యం తాగొద్దని సూచించారు. అయినప్పటికీ తాగడం మానకపోవడంతో శనివారం రాత్రి భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. దీంతో మనస్తాపం చెందని దశరథ్ ఇంట్లో గది లోపలికి వెళ్లి చీరతో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
బైకును ఢీకొన్న ఆర్టీసీ బస్సు: ఒకరి మృతి
జవహర్‌నగర్: జవహర్‌నగర్‌లో పండగపూట విషాదం నెలకొంది. కార్పెంటర్ పనులు ముగించుకుని ఇంటికి వస్తుండగా ఎదురుగా వస్తున్న గుర్తుతెలియని ఆర్టీసీ బస్సు బైక్‌ను ఢీ కొట్టడంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనలో తలబాగం పూర్తిగా నుజ్జునుజ్జు అయింది. ఈ హృదయ విదారక ఘటన జవహర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని చెన్నాపురం చౌరస్తా వద్ద చోటుచేసుకుంది. సీఐ సైదయ్య, స్ధానికులు తెలిపిన వివరాల ప్రకారం చేర్యాల మండలం కడవేర్గు గ్రామానికి చెందిన నగేష్‌చారి బతుకు దెరువు కోసం వలస వచ్చి జవహర్‌నగర్ కార్పొరేషన్ పరిధిలోని ఆదర్శనగర్‌లో భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి ఉంటున్నాడు. ఆదివారం రాత్రి 8 గంటల సమయంలో కార్పెంటర్ పనులు ముగించుకుని దమ్మాయిగూడ నుండి ఇంటికి వస్తుండగా ప్రమాదం జరిగింది. ఈ మేరకు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య