
వాకింగ్‌కు వెళ్లిన వృద్ధుడిపై వీధి కుక్కల దాడి
అమీర్‌పేట: మార్నింగ్ వాకింగ్ కోసం వెళ్లిన ఓ వృద్ధుడిపై వీధికుక్కలు దాడి చేయడంతో అతడి రెండు చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. బీకేగూడ మున్సిపల్ వార్డు కార్యాలయం వద్ద ఆదివారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. బల్కంపేటకు చెందిన 72 ఏళ్ల విశ్రాంత ఉద్యోగి డి.నరసింహ ప్రతి రోజు వార్డు కార్యాలయం పక్కనే ఉన్న పార్కులో మార్నింగ్ వాకింగ్ చేస్తుంటాడు. ఎప్పటిలాగే ఆదివారం ఉదయం వాకింగ్‌కు కోసం బయలుదేరారు. వార్డు కార్యాలయం వద్దకు రాగానే రెండు వీధికుక్కలు వెంట పడి దాడి చేశాయి. రెండు చేతులను గాయపర్చాయి. స్థానికులు బాధితుడిని వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లారు. రాత్రి సమయంలో వీధి కుక్కలు వార్డు కార్యాలయం ఆవరణలోనే ఉంటున్నాయని, ఉదయం పూట వాకింగ్ చేసేవారి వెంట పడుతూ భయాందోళనకు గురి చేస్తున్నాయని వాకర్స్ వాపోయారు. కుక్కల బెడదపై జీహెచ్‌ఎంసీ అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు.

వాకింగ్‌కు వెళ్లిన వృద్ధుడిపై వీధి కుక్కల దాడి