
ఆత్మరక్షణకు కరాటే దోహదం
శంకర్‌పల్లి: ఆత్మరక్షణకు ప్రతి ఒక్కరూ కరాటే నేర్చుకోవాలని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. పట్టణంలోని ఓ ప్రైవేటు గార్డె న్స్‌లో ఆదివారం నిర్వహించిన 1వ దక్షిణ భారత కరాటే చాంపియన్‌షిప్ ముగింపు వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వివిధ విభాగాల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. క్రీడలతో శారీరక ధృడ త్వంతో పాటు మానసికోల్లాసం కలుగుతాయన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం, బీజేపీ నాయకులు వైభవ్‌రెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, వీరేందర్ తదితరులు పాల్గొన్నారు.
కందుకూరు: అంతర్జాతీయ శాంతి దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ సిటిజన్స్ కౌన్సిల్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ రాజ్‌నారాయణ సూచన మేరకు సంస్థ రాష్ట్ర కోఆర్డినేటర్ జి.వేణుగోపాల్ ఆధ్వర్యంలో ఆదివారం టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఏనుగు జంగారెడ్డికి గ్లోబల్ పీస్ అవార్డు–2025 ప్రదానం చేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ.. జంగారెడ్డి అహింసా మార్గంలో విద్యార్థి దశ నుంచి రాజకీయాల్లో ఉంటూ యువతకు మార్గదర్శంగా నిలిచారని, అందుకే అవార్డుకు ఎంపిక చేశామని తెలిపారు. అవార్డు గ్రహీత మాట్లాడుతూ.. హింసా మార్గం ద్వారా ఏమీ సాధించలేమని అన్నారు. దేశాభివృద్ధిలో యువత భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ఎస్.కృష్ణనాయక్, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ కప్పాటి పాండురంగారెడ్డి, సంస్థ నిర్వాహకులు బిచ్చుకారి సూర్య, ఢిల్లీ శివకుమార్, అందుగుల సత్యనారాయణ, సీనియర్ నాయకులు రాకేష్‌గౌడ్, సౌడపు వెంకటేశ్, యు.బాబురావు, మహేందర్, నరసింహా, సురేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఇబ్రహీంపట్నం రూరల్: చాకలి ఐలమ్మ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహిద్దామని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు బి.సామేలు పిలుపునిచ్చారు. ఇబ్రహీంపట్నంలోని పాషానరహరి స్మారక కేంద్రంలో ఆదివారం కేవీపీఎస్, జనవిజ్ఞాన వేదిక, ప్రజానాట్యమండలి సంఘాల నాయకులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సామేలు మాట్లాడుతూ.. తెలంగాణ సాయుధ పోరాటం కుల, మత తారతమ్యాలు లేకుండా జరిగిందని గుర్తు చేశారు. ఈ నెల 26న చాకలి ఐలమ్మ జయంతిని పురస్కరించుకొని త్రిశక్తి కాలనీలో తెలంగాణ సాయుధ పోరాటం వీధి నాటకం రాత్రి 7 గంటలకు ప్రదర్శిస్తారన్నారు. నాటకం వీక్షించి ప్రజలు వాస్తవాలు గ్రహించాలన్నారు. సమావేశంలో తెలంగాణ సాహితి సంస్థ జిల్లా కన్వీనర్ బండి సత్తన్న, ఆలేటి ఆటం, కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి ప్రకాష్ కారత్, ప్రజా నాట్యమండలి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రాజశేఖర్, గణేశ్, జన విజ్ఞాన వేదిక జిల్లా నాయకులు పురుషోత్తం, రాములు, అనంద్, ధనేశ్వర్, జంగయ్య, శ్రీను, శారద, గణేశ్ తదితరులు పాల్గొన్నారు.
మంచాల: మండలంలోని తాళ్లపల్లిగూడకు చెందిన డాక్టర్ ఎన్‌కే భిక్షపతి ప్రొఫెసర్ జయశంకర్ విద్యారత్న అవార్డుకు ఎంపికయ్యారు. ఈనెల 22న (సోమవారం) రవీంద్రభారతిలో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుడు ఏనుగు నరసింహారెడ్డి చేతుల మీదుగా అవార్డు అందుకోనున్నారు.

ఆత్మరక్షణకు కరాటే దోహదం

ఆత్మరక్షణకు కరాటే దోహదం