
కోర్టు ఉత్తర్వులు అమలు చేయండి
యాచారం: ఫార్మాసిటీ భూసేకరణ విషయంలో కోర్టు ఉత్తర్వులను అమలు చేసి, టీజీఐఐసీ పేరు మీద మార్చేసిన రికార్డులను తిరిగి రైతుల పేర్లపై నమోదు చేసేలా కృషి చేయాలని ఫార్మాసిటీ భూ బాధితులు కలెక్టర్ నారాయణరెడ్డికి విజ్ఞప్తి చేశారు. ఇబ్రహీంపట్నం ఆర్డీఓ అనంత్‌రెడ్డి ఆధ్వర్యంలో శనివారం నానక్‌నగర్, నక్కర్తమేడిపల్లి, తాడిపర్తి, కుర్మిద్ద గ్రామాలకు చెందిన పలువురు రైతులు కలెక్టరేట్‌లో కలెక్టర్ నారాయణరెడ్డితో సమావేశమయ్యారు. భూసేకరణకు వ్యతిరేకంగా హైకోర్టు జారీ చేసి ఉత్తర్వుల పత్రాలను కలెక్టర్‌కు అందించారు. ఆన్‌లైన్‌లో భూ రికార్డులను నమోదు చేయాలని ఉత్తర్వులున్నా అధికారులు పట్టించుకోవడం లేదని తెలిపారు. స్పందించిన కలెక్టర్ విషయాన్ని ప్రభు త్వం దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేసేలా కృషి చేస్తా నని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఫార్మాసిటీ వ్యతిరేక పోరాట సమితి నేతలు పాల్గొన్నారు.
కలెక్టర్‌కు భూ బాధితుల విజ్ఞప్తి