విద్యాభివృద్ధికి ‘సాక్షి’ కృషి అభినందనీయం | - | Sakshi
Sakshi News home page

విద్యాభివృద్ధికి ‘సాక్షి’ కృషి అభినందనీయం

Sep 20 2025 7:48 AM | Updated on Sep 20 2025 7:48 AM

విద్య

విద్యాభివృద్ధికి ‘సాక్షి’ కృషి అభినందనీయం

విద్యాభివృద్ధికి ‘సాక్షి’ కృషి అభినందనీయం పాలశీతలీకరణ కేంద్రంలో తనిఖీ రాష్ట్ర స్థాయి టీఎల్‌ఎం మేళాకు ఎంపిక సింబయాసిస్‌లో జాతీయ సదస్సు

షాద్‌నగర్‌రూరల్‌: విద్యాభివృద్ధికి సాక్షి దినపత్రిక చేస్తున్న కృషి అభినందనీయమని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌ కొనియాడారు. ఫరూఖ్‌నగర్‌ మండల పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలకు జెడ్పీటీసీ మాజీ సభ్యుడు వెంకట్‌రాంరెడ్డి ఏటా తన సొంత ఖర్చులతో సాక్షి దినపత్రికను అందిస్తున్నారు. అందులో భాగంగా శుక్రవారం పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయం సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే చేతుల మీదుగా ఎంఈఓ మనోహర్‌కు అందజేశారు. కార్యక్రమంలో ఎంపీడీఓ బన్సీలాల్‌, నాయకులు చల్లా శ్రీకాంత్‌రెడ్డి, కృష్ణారెడ్డి, ముబారక్‌అలీ, సాక్షి సర్కులేషన్‌ ఆఫీసర్‌ అన్వర్‌, ఎస్‌ఆర్‌ ఆంజనేయులు, వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

కడ్తాల్‌: మండల కేంద్రంలోని పాలశీతలీకరణ కేంద్రాన్ని శుక్రవారం తెలంగాణ పాడి పరిశ్రామిభివృద్ధి సహకార సమాఖ్య చీఫ్‌ క్వాలిటీ కంట్రోల్‌ అధికారి కవిత, జనరల్‌ మేనేజర్‌ మధుసూదన్‌రావు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వివిధ పాలసేకరణ కేంద్రాల ద్వారా పాలశీతలీకరణ కేంద్రానికి వచ్చిన పాలను పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ లేకుండా రైతుల నుంచి పాలు సేకరించాలని సూచించారు. పాడి పశువులకు సరైన పోషకాలు అందించేలా, నాణ్యమైన పాలను ఉత్పత్తి చేసేలా పాడి రైతులను ప్రోత్సహించాలన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ డైరెక్టర్‌ మోహన్‌ మురళి, మెనేజర్‌ ప్రాణేశ్‌కుమార్‌, సిబ్బంది పాల్గొన్నారు.

ఇబ్రహీంపట్నం: స్థానిక వెంకటరమణ కాలనీలోని ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయురాలు దీపిక రాష్ట్రస్థాయి టీఎల్‌ఎం మేళాకు ఎంపికై ంది. తుక్కుగూడలోని దేవేంద్ర పాఠశాలలో శుక్రవారం నిర్వహించిన టీఎల్‌ఎం (టీచింగ్‌ లెర్నింగ్‌ మెటీరియల్‌) మెళాలో ఇంగ్లిష్‌లో దీపిక ప్రథమ స్థానం కై వసం చేసుకుంది. దీంతో రాష్ట్రస్థాయి పోటీకి అర్హత సాధించింది. ఈ సందర్భంగా దీపికకు జిల్లా విద్యాధికారి సుశీందర్‌రావు ప్రశంసాపత్రం అందించి అభినందనలు తెలిపారు.

నందిగామ: మండల పరిధిలోని సింబయాసిస్‌ అంతర్జాతీయ యూనివర్సిటీలో గురువారం ఇండియన్‌ నాలెడ్జ్‌ సిస్టమ్స్‌ అంశంపై జాతీయ సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి యునెస్కో పాలక మండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ శర్మ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. భారతీయ జ్ఞాన వ్యవస్థ, సమకాలీన శాసీ్త్రయ, ఆర్థిక, వ్యాపార లక్ష్యాల విశిష్టత ఎంతో గొప్పదని అన్నారు. కార్యక్రమంలో యూనివర్సిటీ ప్రొఫెసర్‌ వేణుగోపాల్‌, మాజీ ఎంపీ వర్మ, యూనివర్సిటీ ప్రొఫెసర్లు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

విద్యాభివృద్ధికి ‘సాక్షి’ కృషి అభినందనీయం 1
1/1

విద్యాభివృద్ధికి ‘సాక్షి’ కృషి అభినందనీయం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement