
నేరాలను నియంత్రించాలి
ఇబ్రహీంపట్నం రూరల్: ప్రజలకు పోలీసులు దగ్గరవ్వాలని, శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేయాలని మహేశ్వరం జోన్ డీసీపీ సునీతారెడ్డి అధికారులు, సిబ్బందికి సూచించారు. ఆదిబట్ల పోలిస్‌స్టేషన్‌ను శుక్రవారం ఇబ్రహీంపట్నం ఏసీపీ కేపీవీ రాజుతో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించిన అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. విజిబుల్ పోలీసింగ్‌ను పకడ్బందీగా అమలు చేయాలని అన్నారు. కాలనీలు, గ్రామాలు, బస్‌స్టేషన్లు, రైల్వే స్టేషన్లు, ప్రార్థనా మందిరాలు, షాపింగ్ కాంప్లెక్స్, మార్కెట్ ప్రాంతాల వంటి రద్దీ ప్రదేశాల్లో అవగాహన కార్యక్రమాలు పెంచాలన్నారు. నేరాల నియంత్రణకు పాటుపడాలన్నారు. సున్నితమైన ప్రాంతాల్లో భద్రత మరింత పెంచి, సోషల్ మీడియాపై నిరంతరం నిఘా పెట్టాలన్నారు. కార్యక్రమంలో ఆదిబట్ల సీఐ రవికుమార్, ఎస్‌ఐలు వెంకటేశ్, నోయల్‌రాజ్, సైదయ్య, సత్యనారాయణ, ఏఎస్‌ఐలు యాదయ్య, శ్రీనివాస్ పాల్గొన్నారు.
మహేశ్వరం జోన్ డీసీపీ సునీతారెడ్డి